అదేంటి అలా అనేసింది… మనోజ్ విషమై ‘ఎవడి గుల వాడిది’ అని స్పందించిన అక్క మంచు లక్ష్మి!

మంచు లక్ష్మి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మంచు ఫామిలీ అంటేనే జనాలకి ఎంతో ప్రీతి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నట వారసులైన మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి గురించి రోజూ ఏదోఒక వార్త వింటూనే ఉంటాం. కాగా ఈమధ్య కాలంలో మనోజ్ రెండో పెళ్లిపై పుకార్లు వింటూ వున్నాము. దివంగత భూమా నాగిరెడ్డి – భూమా శోభ దంపతుల రెండో కుమార్తె అయినటువంటి భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఈమధ్య సన్నిహితంగా ఉంటున్న వీడియోలు బయటపడంతో వారి వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ మధ్యన వినాయక చవితి సందర్భంగా మనోజ్ – మౌనిక కలిసి సీతాఫలమండిలోని వినాయక మండపానికి రావడం అందరికీ తెలిసినదే. ఇదిగో ఎక్కడినుండో మొదలైంది అసలు రచ్చ. ఇదే విషయం మీద మంచు మనోజ్ ను ప్రశ్నించగా.. ”అది వ్యక్తిగత విషయం.. మంచి రోజు వచ్చినప్పుడు నేనే మీ అందరికీ చెప్తాను.” అని చాలా సాఫ్ట్ గా మాట దాట వేసాడు మనోజ్. అలాగే మనోడు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా త్వరలోనే చెప్తాను… అంటూ ఓ చెవాక్కు విసిరాడు. దాంతో మీడియాలో ఈ వార్త హోరెత్తింది.

ఇక తాజాగా మనోజ్ పెళ్లిపైన ఓ మీడియా మంచు లక్ష్మిని అడగగా ఆమె చాలా విచిత్రంగా స్పందించింది. తన తమ్ముడి వివాహంపై ఆమె మాట్లాడుతూ.. “ఎవడి గుల వాడిది, ఇక్కడ ఎవరికి నచ్చింది వారు చేస్తారు. వారిమధ్య ప్రేమ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. దానికింకా టైం వుంది. ఎవరి బ్రతుకు వారిని బతకనివ్వండి” అంటూ చాలా చిత్ర విచిత్రంగా వ్యాఖ్యలు చేసింది. మరలా మాట్లాడుతూ… “ఈ రోజుల్లో నిజాయతీ కలిగిన ప్రేమను పొందడం చాలా కష్టం. మనోజ్ అలాంటి ప్రేమను పొందితే నేను సంతోషిస్తాను. మనోజ్ కు ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి” అని మంచు లక్ష్మీ తమ్ముడిని దీవించింది.

Share post:

Latest