దర్శకుడుగా మారుతున్న జబర్దస్త్ కమెడియన్..!!

సినీ పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు ఇలాంటి క్రేజ్ వస్తుందో చెప్పలేము. అలా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు కొందరు. తాజాగా ఒక కమెడియన్ కూడా సిని ప్రేక్షకులకు అలాంటి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఒక చిత్రాన్ని దర్శకత్వం చేసి విడుదల చేయడానికి సిద్ధం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు జబర్దస్త్ కమెడియన్. అతను ఎవరో కాదు జబర్దస్త్ వేణు వండర్. నటుడుగా ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. ముఖ్యంగా అటు వెండితెరపై బుల్లితెరపై కూడా తన కామిడి తో అందరిని నవ్వించారు. ముఖ్యంగా ప్రభాస్ నటించిన మున్నా చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలు నటించి అందరిని ఆకట్టుకున్నారు వేణు.

Jabardasth Venu: అమ్మాయి కోసం రోజుకు రూ.25 వేలు ఖర్చు చేసిన జబర్దస్త్  వేణు.. కానీ చివరికి?– News18 Telugu
ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో స్కిట్లు చేయడం మొదలుపెట్టి తన టీమ్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక కథ రాసుకొని దర్శకుడుగా మారబోతున్నారు. ఇక ఈ చిత్ర కథను అగ్ర నిర్మాత కి చెప్పడంతో ఆ నిర్మాత కూడా సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక నిర్మాత ఎవరో కాదు దిల్ రాజ్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ను కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటున్నారు తెలుస్తోంది.

Jabardasth Comedian Hits Jackpot | cinejosh.com
తెలంగాణ ప్రాంతాలలో ఆత్మహత్యల మీద ఒక చిత్రాన్ని తెరకెక్కించినట్లు వేణు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరెవరు నటించారని విషయాలు మాత్రం ఇంకా బయటికి రావడం లేదు.. కథపై ఉన్న నమ్మకంతో దిల్ రాజు దర్శకుడు అడిగినవన్నీ సమకూర్చినట్లు తెలుస్తున్నది.త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్కుని రిలీజ్ చేసి ఆ తరువాత ఈ సినిమా అప్డేట్ ను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వేణు వండర్ కమెడియన్ గా ఇండస్ట్రీకి దూరమైన దర్శకుడుగా నేర్పిస్తారేమో చూడాలి మరి.