గాడ్ ఫాదర్ చిత్రం కోసం నయనతార.. ఎన్ని కోట్లు తీసుకుందంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార నటన ,అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళంలోనే కాకుండా ఇతర భాషలలో సైతం తన హవా కొనసాగిస్తూ ఉన్నది. నాలుగు పదుల వయసు దాటినా కూడా నయన్ ఇప్పటికి అవకాశాలు దక్కించుకుంటూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. మొన్నటివరకు లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించిన నయనతార ఇటీవల తన ప్రియుడు విఘ్నేష్ ను వివాహం చేసుకుంది. సీనియర్ హీరోయిన్ కావడంతో నయనతారకు పలు సినిమాలలో అవకాశాలు వెల్లుబడుతూనే ఉన్నాయి.

Nayanthara first look from Godfather

అలా తమిళ్ తెలుగులో ఉన్న సీనియర్ హీరోలతో కూడా నటించడానికి నయనతార ఓకే చెబుతున్నారు. ఇప్పటికే నయనతార తెలుగులో ఎంతోమంది హీరోలతో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా నటించడానికి ఓకే చెప్పింది ఈ సినిమా నిన్నటి రోజున చాలా గ్రాండ్గా విడుదలై సక్సెస్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. నయనతార గతంలో చిరంజీవి శాసన హీరోయిన్గా కూడా నటించింది. మొదట చెల్లెలి పాత్రలో నటించడానికి నో చెప్పిన కూడా ఆ తర్వాత చిరంజీవి కోరిక మేరకు ఈమె సోదరి క్యారెక్టర్ లో నటించినట్లు సమాచారం.

Does Nayanthara demand huge remuneration to star opposite Chiranjeevi in ' Godfather'? | Telugu Movie News - Times of India

అయితే నయనతార అందుకోసం చాలా కండిషన్లు పెట్టిందని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు మెహన్ రాజా నయనతార క్యారెక్టర్ ను కాస్త తక్కువ చేసి చూపించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం చిరంజీవిని హైలెట్ చేసేందుకు డైరెక్టర్ ఇలా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నయనతార ఈ సినిమా కోసం ఏకంగా రూ. 8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నయనతార ఇంతటి రెమ్యూనరేషన్ తీసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Share post:

Latest