పుష్ప సినిమాని తలపించేలా ఉన్న కాంతారా ట్రైలర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక అంతే కాకుండా పుష్పరాజ్ ఢీకొట్టే పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్ ఫహద్ ఫాజల్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి పాత్రలతోనే మరొక సినిమా రాబోతున్నది ఇక్కడ కూడా ఎర్రచందనం చెట్ల చుట్టూ మధ్య తిరిగే కథ అంశంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. హీరోగా రిషబ్ శెట్టి.. నటించిన కాంతార ట్రైలర్ తాజాగా విడుదల ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

Kantara Movie Review - Movie Reviews
కేరళలో అందమైన సంస్కృతి ని ఈ సినిమా ట్రైలర్ లో చాలా అద్భుతంగా చూపించారు.అక్కడ పల్లెల్లే జరిగి పట్టు అందాలను అడవులను ఎంతో మెస్మరైజింగ్ గా చూపించారు. తాజాగా విడుదలైన కాంతారా తెలుగు ట్రైలర్ చూస్తే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఘాటైన రొమాన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తోంది. అయితే ట్రైలర్ కూడా దొంగ పోలీస్ మధ్య జరిగే కథ అంశంగా కనిపిస్తోంది. ఇక కే జి ఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిం బ్యానర్ పైన ఈ సినిమా కోసం భారీగానే పెట్టుబడులు పెట్టారని చెప్పవచ్చు.

తాజాగా హోంబలే , రిషన్ శెట్టి కాంబినేషన్లు వస్తున్న ఈ కాంతారా చిత్రం ప్రతి ఒక్కరిని ఆసక్తి కలిగించేలా చేస్తోంది.ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ భారీ అంచనాలను పెంచేస్తోంది. కన్నడలో ఈ సినిమా సెప్టెంబరు 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీంతో ఈ సినిమా విడుదలైన ప్రతి చోట భారీగానే రెస్పాన్స్ లభించింది. అందుచేతనే ఈ చిత్రాన్ని ఇతర భాషలలో కూడా డబ్ చేసి విడుదల చేయాలని చూస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమా తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కాబోతోంది.