బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న సీనియర్ నటి శ్రియ.. 40లో కూడా కుర్రాళ్లకు వల విసురుతోంది!

హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె టాలీవుడ్లో ఏకంగా దశాబ్దం కాలం పాటు ఓ ఊపు ఊపింది. మొదటి సినిమా సంతోషం సినిమాతో అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. దాదాపు ఇండస్ట్రీలోని బడా హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. కెరీర్ మొదట్లో లవ్ స్టోరీలు ఎంపిక చేసుకున్న శ్రియ.. ఆ తర్వాత పాత్రలకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించింది. ఆమె నటించిన మూవీస్ చాలా వరకు హిట్ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, బాలయ్యబాబు, వెంకటేశ్‌లతో కుర్రహీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

శ్రియ సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన తొలినాళ్లలో అందాల ఆరబోతపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎక్స్ పోజింగ్ చేయక తప్పలేదు. ఈ క్రమంలో చియాన్ విక్రమ్ ‘మల్లన్న’ సినిమాలో అమ్మడు రెచ్చిపోయి నటించింది. తెలుగు సినిమాల్లో సత్తా చాటాక.. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అలా దాదాపు ఓ దశాబ్దకాలం పాటు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసిన శ్రియ తరువాత కాస్త రెస్ట్ తీసుకొని ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

ఈ బక్కపలచని ముద్దుగుమ్మ సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో అభిమానులకు తన పిక్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తుంది. సినిమాల్లోనే కాకుండా సామాజిక మాద్యమాల్లోనూ శ్రియకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రాళ్లను పరీక్షిస్తోంది. ఎద అందాలను మోయలేకపోతున్నట్టు ఆమె ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.

Share post:

Latest