2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధమే.. గెలుపు ఎవరిదో చూద్దాం..!

తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగలో సంక్రాంతి కూడా ఒకటి.. ఈ పండుగను అందరూ తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ సందర్భంలో ఈ పండగ టాలీవుడ్ కూడా చాలా ప్రధానమైన పండుగనిని చెప్పవచ్చు. ఈ పండగ విడుదలయ్యే సినిమాలు ఎలాంటి సినిమాలు అయినా హిట్ అయ్యి మంచి కలెక్షన్లు రాబట్టుకుంటాయి. ఈ సందర్భంలోనే 2023 సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Andhra Pradesh: Govt intensifies raids on theatres

వీటిలో ప్రధానంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వటానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్షన్లో భారీ విజువల్ వండర్ గా వస్తున్న మైథ‌ లాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’ ఈ సినిమాని ఇప్పటికే జనవరి 12 సంక్రాంతి రిలీజ్ చేస్తావని మేకర్స్ ఎప్పుడో కన్ఫామ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా రేపటి నుంచి సినిమా యూనిట్ మొదలుపెట్టనుంది. రేపు అయోధ్యలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరును కన్ఫర్మ్ చేశారు. ఇందులో చిరంజీవికి జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కాగా ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది.

Megastar Chiranjeevi, Bobby Mega154's Worldwide Grand Release In Theatres For Sankranthi 2023 - Bobby, Shruthi Hasan, Chiranjeevi, Mythri Makers, Sankranthi - Megastar Chiranjeevi, Bobby Mega154's Worldwide Grand Release in Theatres For Sankranthi

అలానే ఈ రెండు సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ‘వారసుడు’ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పుడో ప్రకటించాడు. ఇందులో విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తుంది. ఈ విధంగా ఈ మూడు బడా సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ యుద్ధం తప్పేలా లేదు. ఇక మరి ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాదిస్తారని తెలియాలంటే మరొక మూడు నెలలు ఆగాల్సి ఉంది.

Vijay Name in Varisu வாரிசு படத்தில் விஜய்யின் பெயர் இதுதானா? | Search Around Web

Share post:

Latest