సమంత మొదటి క్రష్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం తన హవా ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు.. అయితే గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత కారణాల వల్ల షూటింగులకు కాస్త దూరంగా ఉంటుంది సమంత.అయితే ప్రస్తుతం తను నటించిన శాకుంతల చిత్రం నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇ సినిమా కి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. సమంత గతంలో ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన పలు విషయాలను తెలియజేసింది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రేమ గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. కొని తెచ్చుకోవాలని అనుకోవడం లేదు  అంటూ! | Samantha reponds on Love And Hate in her latest interaction -  Telugu Filmibeat

ఏం మాయ చేసావే సినిమాలో నటించిన జెస్సీ పాత్రలో తను నటించడానికి చాలా కష్టపడ్డానని తెలియజేస్తుంది. కాలేజీలో ఉన్న సమయంలో మోడలింగ్ చేసే దానిని అలా యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో నెమ్మదిగా ఒక ఇన్స్టిట్యూట్లో చేరి నటన నేర్చుకొని నటించానని సమంత తెలియజేసింది. సమంత ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే తన సీనియర్ అయినా ఫస్ట్ క్రష్ అని తెలియజేసింది. తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని కూడా తెలిపింది. తనకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని తెలియజేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనలోని ఎలాంటి మార్పు రాలేదని తెలియజేసింది.

ముఖ్యంగా సమంత నటించిన ఏం మాయ చేసావే సినిమా కథ వినకుండానే ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని తెలియజేసింది. షూటింగ్ మొదలుపెట్టిన మొదటి రోజు తను నటించే సన్నివేశంలో తనకు డైలాగులు లేకపోయినప్పటికీ కూడా తనలో చాలా భయం పుట్టిందట.. తనలో అసలు రొమాంటిక్ యాంగిల్ లేదని సమంత తెలిపింది. సమంత ప్రతి సినిమాకి తన క్రేజ్ ను పెంచుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోతోంది.

Share post:

Latest