శ్రీ దేవిలా పేరు పొందాలని చూస్తున్న యువ హీరోయిన్.. సాధ్యమవుతుందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటగా ఉప్పెన సినిమాతోనే స్టార్ హీరోయిన్గా పేరు పొందింది కృతి శెట్టి. తను నటించిన మొదటి సినిమాతోనే కుర్రకారులకు సైతం మంత్రముగ్ధులను అయ్యేలా చేసింది. ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకుని హ్యాట్రిక్ విజయాలను కూడా అందుకుంది. అయితే మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ సినిమాలు మాత్రం ఈమెకు అనుకోకుండా షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు ఈ రెండు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఇక తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా ఇటీవల విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా లో హీరోగా సుధీర్ బాబు నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు.

Krithi Shetty's Remunearion and demands irk Tollywood
ఈ సినిమా విడుదలైన సందర్భంగా తాజాగా ఒక మీడియాతో మాట్లాడిన కృతి శెట్టి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఈ సినిమా విజయం తనకు చాలా ప్రత్యేకమైనదని తెలియజేసింది.నేను నా జీవితానికి చాలా దగ్గరగా ఉండే పాత్రలో ఇన్ని రోజులకు నటించానని.. ఈ సినిమా చూసి తనకు చాలామంది ఫోన్ చేసి తమని తాము స్క్రీన్ పైన చూసుకుంటున్నట్లు ఉందని చెబుతుంటే తనకు చాలా సంతోషంగా అనిపించింది అని చెబుతోంది కృతి శెట్టి.. ఒక నటిగా ఇంతకంటే తనకు కావలసింది ఏముంది అని తెలియజేస్తోంది.

When a 10-year-old Sridevi was signed as the lead heroine of a film, here's  how her mom reacted
ఈ సినిమా చూసి తన తల్లి కూడా చాలా ఎమోషనల్ అయిందని.. ఈ సినిమాలో నటించడం తన తల్లిదండ్రులకు చాలా గర్వంగా అనిపించిందని చెప్పుకొచ్చింది.అలాగే కెరియర్ ప్రారంభంలో ఇలా ఎన్నో భిన్నమైన పాత్రలో పోషించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో పోషించినప్పుడే ప్రేక్షకులకు కూడా తనలోని నటనను ప్రతిపను గుర్తిస్తారని తెలియజేసింది. ఇక సినిమాల విషయంలో సీనియర్ హీరోయిన్ శ్రీదేవి తనకి స్ఫూర్తి అని ఆమె కూడా ఇలాంటి ఎన్నో పాత్రలను నటించిందని తెలియజేసింది.తనకు కూడా శ్రీదేవి అంతటి పేరు రావాలని కూడా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.. మరి అనుకున్నది వస్తుందో రాదో చూడాలి మరి.

Share post:

Latest