రణ్ బీర్ కపూర్ ను దేవాలయాల్లోకి అనుమతించకపోవడానికి కారణం..?

పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మాస్త్రం. ఈ చిత్ర బృందం తాజాగా నిన్నటి రోజున మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గుడికి వెళ్ళిన రణబీర్ కపూర్, ఆలియా భట్ కు, బజరంగ్ దళ్ నుంచి నిన్నటి రోజున నిరసనలు ఎదురయ్యాయి . అందుకు ముఖ్య కారణం బీఫ్ తినే రణబీర్ కపూర్ ను ఈ గుడిలోకి రానివ్వమంటూ అక్కడ ఉండే కొంతమంది మహంకాళి భక్తులు వీరిని అడ్డుకోవడం జరిగింది. బ్రహ్మాస్త్ర సినిమా దగ్గర పడుతూ ఉండడంతో రణబీర్ కపూర్, ఆలియా భట్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మహంకాళి దేవాలయానికి వెళ్లడం జరిగింది. దీంతో అక్కడ నిరసనలు చేపట్టిన కొంతమంది భక్తులను చూసి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.After Ranbir Kapoor, Alia Bhatt stopped, Ayan Mukerji visits Ujjain temple  alone | Bollywood - Hindustan Times

గతంలో రణబీర్ కపూర్ తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని.. ఆ విషయాన్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకు వచ్చి వివాదంగా మార్చారు. మా కుటుంబం శేషావర్ నుంచి వచ్చింది అనేక శేషావర్ వంటకాలు కూడా వాళ్లతో పాటు వచ్చాయి.. మటన్, పాయ, బీఫ్ అంటే తనకు చాలా ఇష్టమని.. 2011వ సంవత్సరంలో రాక్ స్టార్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని వైరల్ గా చేస్తూ అక్కడ ఉండే కొంతమంది భక్తులు సైతం మహంకాళి గుడిలోకి వెళ్ళనివ్వకుండా వీరిని అడ్డుకుంటున్నారు.Ranbir Kapoor, Alia 'stopped' from entering Ujjain temple; 'his beef  statement…' | Latest News India - Hindustan Timesఇక అంతే కాకుండా బీఫ్ తినే రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్రం సినిమాను బాయ్కాట్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాతోనైనా బాలీవుడ్ తలరాతను మారుస్తుందని రణబీర్ ఆలియా దంపతుల అభిమానుల సైతం భావిస్తున్నారు.

Share post:

Latest