మరోసారి లవ్ కి బ్రేకప్ చెప్పిన సుస్మితాసేన్.. ఈసారి కారణం ఎవరంటే..?

మాజీ విశ్వాసుందరి సుస్మితాసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్లో ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితంలో మాత్రం పూర్తిస్థాయిలో విమర్శలకు గురి అవుతోందని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమందితో ప్రేమాయణం నడిపి పెళ్లి పీటల వరకు వెళ్లి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇకపోతే తాజాగా ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీతో మాజీ విశ్వసిందరి సుస్మితసేన్ ప్రేమలో పడి చట్టాపట్టాలేసుకొని కూడా తిరిగారు . ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ బ్రేకప్ చెప్పిందా.. లలిత్ మోడీ ఇన్స్టాల్ లో వచ్చిన మార్పులు చూసి వీరిద్దరూ విడిపోయారంటూ వస్తున్న వార్తలకు కారణం అతడేనా? అంటూ కూడా బాగా గుసగుసలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.Sushmita Sen breaks silence after Lalit Modi's 'just dating' post

అసలు విషయం ఏమిటంటే .. నెల రోజుల క్రితం లలిత్ మోడీ , సుస్మిత సేన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు కూడా వార్తలు రావడంతో నెటిజన్ లు నిజంగానే వీరిద్దరూ విడిపోతున్నారా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే లలిత్ మోడీ గతంలో సుస్మితాసేన్ నా బెటర్ ఆఫ్ అంటూ ఒక ఫోటోని షేర్ చేశాడు. అంతేకాదు నా బెటర్ ఆఫ్ తో కొత్త జీవితం ప్రారంభం అవుతుంది అని ట్వీట్ కూడా చేశాడు. కానీ లేటెస్ట్ గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సుస్మితాసేన్ ఇటు లలిత మోడీ ఎవరు కూడా సమాధానం ఇవ్వడం లేదు.Sushmita Sen & IPL Founder Lalit Modi are in relationshipసోషల్ మీడియా యూజర్లు , లలిత్ మోడీ ఇంస్టాగ్రామ్ లో కొన్ని మార్పులను గమనించారు. లలిత్ మోడీ తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి సుస్మిత సేన్ పేరును తొలగించడమే కాకుండా ఆమెతో కలిసి ఉన్న ఫోటోకు సంబంధించిన డీపీ ని కూడా మార్చేశారు. అందుకే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం సుస్మిత మాజీ ప్రియుడు రోహ్మన్ అని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయంపై వారే నోరు విప్పాల్సి ఉంటుంది.

Share post:

Latest