ఆటోలో ఖుషీఖుషీగా హైదరాబాద్‌లో చక్కెర్లు కొట్టిన హీరోయిన్‌!

సినిమా హీరోయిన్లు బయట తిరగడం ఎపుడైనా చూసారా? కారులో కాకుండా ఓ సాధారణ వ్యక్తిలాగా ఆటోలో తిరగడం చూసారా? చూడలేదు కదూ. ఎందుకంటే సెలిబ్రిటీలు మనలాగా జన సమూహాల్లోనూ… పైగా రోడ్డుమీద ఓ సాధారణ ఆటోలో ప్రయాణం చేయలేరు. ఎందుకంటే అది చాలా కష్టమైన వ్యవహారం వాళ్ళకి. అయితే సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. 15 ఏళ్ల క్రితం వరకు కూడా సెలబ్రిటీ అంటే టీవీ, సినిమాల్లో నటించేవారు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు మాత్రమే అన్నట్లు ఉండేవి పరిస్థితులు. అయితే కాలం ఎంత మారినా సెలబ్రిటీలకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు.

మరీ ముఖ్యంగా వాళ్లు అందరిలాగా స్వేచ్ఛగా బయటకు వచ్చి తిరగలేరు.. కానీ ఓ హీరోయిన్‌ మాత్రం.. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్‌ వేసుకుని.. భాగ్యనగర వీధుల్లో.. ఆటోలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆమె మరెవ్వరో కాదు.. ఒకప్పుడు వెండితెర మీద స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రజ. అవును… పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు.

దాదాపు 7 ఏళ్ల గ్యాప్‌ తర్వాత దిక్కులు చూడకు రామయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు ఇంద్రజ. అప్పటి నుంచి పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. మరోవైపు బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నారు సీనియర్ నటి ఇంద్రజ. కార్లో అయితే డోర్స్‌ అన్ని క్లోజ్‌ చేసుకుని.. కూర్చోవాలని.. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది.. ఇలా ఆటోలో ప్రయాణించడం చాలా బాగుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Share post:

Latest