ఆడపిల్లని నలుగురిలో ఇలాంటి ప్రశ్న అడుగుతారా..? రిపోర్టర్ పై మెగా హీరోయిన్ ఫైర్..!!

ఈ మధ్యకాలంలో ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక ప్రశ్నను తీసుకొని కాంట్రవర్షియల్ గా మార్చి దానికి పెద్దగా ప్రమోషన్స్ చేసుకోవడం . ఎంతటి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఇలాంటి తతంగాలు చూస్తూనే ఉన్నాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్లు కాళ్ల మీద పడిపోవడం.. సినిమా ప్రమోషన్స్ లో రిపోర్టర్స్ ఏదైనా ప్రశ్న వేస్తే కావాలని దానితో తప్పుడు అర్ధాలు లేకపోయినా తప్పు పట్టడం. ఇలా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటిదే చోటుచేసుకుంది

డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో ఇద్దరు హాట్ బ్యూటీస్ రెజీనా కసాండ్రా నివేదా థామస్ లీడ్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాకినీ డాకిని . సౌత్ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్ నైట్ రన్నర్ స్కూల్ అధికారిక రీమేక్ గా.. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ గురు ఫిలిమ్స్ క్రాస్ పిక్చర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జనాలకు విపరీతంగా కట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో హీరో లేకపోయినా కానీ హ్యూజ్ పాపులారిటీని దక్కించుకుంది . ఇద్దరి హీరోయిన్స్ కూడా సినిమాలు చేయగలరు అని ప్రూవ్ చేసింది.

ఈ మూవీ సెప్టెంబర్ 16న జనాల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను సరవేగంగా పూర్తి చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ రెజీనా ఫైర్ అయిపోయింది . అసలు ఎందుకు ఆమె ఫైర్ అవుతుందో కూడా తెలియనంతగా అక్కడ సీన్ క్రియేట్ చేయడం. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అటెండ్ అవుతుంది. రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ..” సాకిని డాకిని సినిమాలో మీ పాత్రకు ఓసిడి ఉంది కదా.. మరి నిజ జీవితంలో కూడా మీకు అలాంటి ఓసిడి ఏమన్నా ఉందా..?” అంటూ సరదాగా ప్రశ్నించాడు రిపోర్టర్.

దీనిపై ఒక్కసారిగా ఫైర్ అయిపోయింది. రెజీనా ఆమె మాట్లాడుతూ ..”సినిమాలో అమ్మాయిల గురించి చాలా గొప్పగా చూపించాం . అది మీకు కనిపించలేదు ..వాటి గురించి మీరు ఒక్క ప్రశ్న కూడా నన్ను అడగట్లేదు ..నాకు ఓసిడి లేదు ..జనరల్ గా అమ్మాయిలు చాలా నీట్ గా ఉంటారు”.. అంటూ కౌంటర్ వేసినట్టు చెప్పింది. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే రిపోర్టర్ అడిగిన ప్రశ్నలో తప్పేముంది అంటున్నారు మీడియా మిత్రులు. ఏ సినిమాలో అయినా సరే కథను మెయిన్ పాయింట్ గా చేసుకునే ప్రశ్నలు ప్రెస్ మీట్ లో అడుగుతుంటారు. అలా మీరు ప్రతి దానికి కోప్పడే దానికి ప్రెస్ మీట్ అవసరమా అంటూ మీడియా వాళ్ళు సూటిగా రెజీనాన్ని ప్రశ్నిస్తున్నారు . ఓసిడి అనే ఒక్క పదానికి ఆమెకు అంత కోపం వచ్చిందా అంటూ నెటిజన్స్ సైతం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై రెజీనా ఎలా స్పందిస్తుందో చూడాలి..?

Share post:

Latest