ఆ ఫ్లాప్ సినిమా కోసం 28 కోట్లు ఖర్చు చేసిన మెగా హీరో..నవ్వుకుంటున్న జనాలు..!?

‘ఉప్పెన’ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత తన రెండో సినిమా ఎవరు ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. తాజాగా వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను సరిగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాని తీయటానికి ఎంతో బడ్జెట్ అయి ఉండదని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ సినిమా మొత్తం ఒక ఇంట్లోనే ఎక్కువ శాతం షూటింగ్ చేశారు. బయట షూటింగ్ చాలా తక్కువ శాతం లోనే చేశారు. దీనివల్ల సినిమాకి పెద్దగా ఖర్చు అయ్యుండదని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమాకు కలెక్షన్ రాకపోయినా నిర్మాతకు నష్టాలు ఉండవని అందరూ భావిస్తున్నారు.

Ranga Ranga Vaibhavanga teaser: Vaisshnav Tej promises a romantic comedy  with a twist. Watch video | Entertainment News,The Indian Express

తాజాగా టాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఈ సినిమాకి నిర్మాతలు భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. రూ.28 కోట్ల వరకు ఈ సినిమా కి ఖర్చు పెట్టినట్టు బయటకు వచ్చింది. కాగా ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ మరియు నాన్ థియేట్రిక‌ల్‌ రైట్స్ పరంగా 21 కోట్ల వరకు ప్రొడ్యూసర్ కు వచ్చింది. మిగతా 7కోట్లు సినిమాకు వచ్చే లాభాలలో ప్రొడ్యూసర్ తీసుకోవాలి. అయితే ఈ సినిమాకు భారీ డిజాస్టర్ టాక్ రావడంతో. ఇంత ప్లాప్ సినిమాకి అంత ఖర్చు పెట్టడం అవసరమా అన్న టాక్ సినీ వర్గాల్లో వస్తుంది. తాజాగా వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమాని కూడా భారీ నష్టాల్లో పడేసాడు.

Share post:

Latest