నాగశౌర్య.. కృష్ణ వ్రిందా విహారి చిత్రంతో సక్సెస్ అయ్యాడా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత దిక్కులు చూడకు రామయ్య, ఛలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఇక ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హీట్ పడిన ఖాతాలో చేరలేదు నాగశౌర్య. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఉద్దేశంతోనే “కృష్ణ వ్రిందా విహారి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమాతోనైనా నాగచౌలో సక్సెస్ అందుకున్నాడేమో తెలుసుకుందాం.

Krishna Vrinda Vihari: "కృష్ణ వ్రింద విహారి" రాక అప్పుడే.. హిట్ కొడతాడా ? -  OK Telugu
ఇక కథ విషయానికి వస్తే నాగశౌర్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం ట్రైనర్ గా జాయిన్ అవుతాడు.. ఆ కంపెనీలో పని చేస్తున్న మేనేజర్ షేర్లీతో పరిచయం ఏర్పడుతుంది..ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇక వీరిద్దరూ కలిసి పనిచేయడం తో వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది అనే కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. నాగశౌర్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయిగా నటించారు. హీరోయిన్ షేర్లీతో ప్రేమలో పడిన తర్వాత నాగశౌర్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నది మిగతా కథ.. ఇక ఈ చిత్రంలో కామెడీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

Krishna Vrinda Vihari (2022) - Movie | Reviews, Cast & Release Date in  hyderabad - BookMyShow

ఈ చిత్రంలోని నాగశౌర్య హీరోయిన్ షేర్లి జంట చూడడానికి చాలా అద్భుతంగా నటించారు. ఇక అంతే కాకుండా వీరిద్దరి మధ్య కామెడీ కూడా బాగా సాగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కుటుంబ కథ చిత్రం. అయితే డైరెక్టర్ కథ పై ఇంకాస్త పదును పెట్టి ఉంటే.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునేది అన్నట్లుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని ట్విస్ట్ లు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలోని నటీనటులు, ఫ్యామిలీ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకి ప్లస్సుగా ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపించాయి. కానీ ఎట్టకేలకు నాగశౌర్య ఈ చిత్రంతో తమ అభిమానులను అలరించారని చెప్పవచ్చు.

Share post:

Latest