జానీ మాస్టర్ అంత ఆస్తి సంపాదించారా?.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

టాలీవుడ్ లో ప్రస్తుతం శేఖర్ మాస్టర్ నెంబర్ వన్ కొరియోగ్రఫర్ గా కొనసాగుతున్నారు. ఆయన తర్వాత ఎవరంటే.. జానీ మాస్టరే అని చెప్పాలి.. జానీ మాస్టర్ ఎంతటి టఫ్ మూవెంట్స్ కూడా ఈజీగా చేయిస్తుంటారు. అందుకే పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు జానీ మాస్టర్ అంటే అందరికీ ఇష్టమే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పనిచేశారు. ఈటీవీలో వచ్చిన అల్టిమేట్ డాన్స్ షో అనే రియాలిటీ షోలో డాన్సర్ గా జానీ మాస్టర్ తన కెరీర్ ని ప్రారంభించారు. 2009లో ద్రోణ మూవీకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2012లో రచ్చ సినిమాలో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఓ రేంజ్ లో ఉంటుంది. తమ పాటకు జానీ మాస్టరే కావాలంటే స్టార్ హీరోలు కొరునేలా ఆయన రేంజ్ పెరిగిపోయింది. బన్నీ, రామ్ చరణ్, తారక్ లాంటి హీరోలు జానీ స్టెప్పులకు ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టం.. ఆయన నటించే సినిమాలకు జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా నియమించుకుంటారు. అంతేకాదు 2014లో సల్మాన్ ఖాన్ నటించిన జయహో సినిమాకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా టైటిల్ సాంగ్ కు జానీ మాస్టర్ వేయించిన మాస్ డాన్స్ సూపర్ అని చెప్పాలి. ఇక అలా వైకుంఠపురంలో సినిమాలో బుట్ట బొమ్మ పాటకు వేయించిన క్లాస్ స్టెప్పులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరితో ఆయన పనిచేశారు. అనేక రియాలిటీ డాన్స్ షోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. జడ్జీగా కూడా వ్యవహరించారు.

అయితే జానీ మాస్టర్ భార్య డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారట.. ఆ సమయంలో ఆయన వద్ద డబ్బులు కూడా లేవట.. ఆయన భార్యకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారట. ఆ టైమ్ లో ఏం చేయాలో తెలియక చరణ్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే అపోలో ఆస్పత్రికి వెళ్లమని చెప్పారట. డెలివరీ తర్వాత బిల్లు రూ.5 లక్షలు అయ్యిందట.. డబ్బు ఎలా కట్టాలని ఆలోచిస్తున్న సమయంలో హాస్పిటల్ స్టాఫ్ 300 బిల్లు ఇచ్చి కట్టాలని చెప్పార. ఆయన షాక్ అయి వారిని అడిగితే.. బిల్లు చరణ్ మరియు ఉపాసన కట్టేశారని చెప్పారట.. ఆ టైమ్ లో కళ్లల్లో నీళ్లు వచ్చాయట.

ఇక జానీ మాస్టర్ రెమ్యూనరేషన్ గురించి చెప్పుకుంటే.. ఆయన ఒక్కో సినిమాకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు తీసుకుంటారు. ఇక స్పెషల్ సాంగ్ అయితే రూ.10 లక్షలకు పైగా తీసుకుంటారట.. జానీ మాస్టర్ కి ఆస్తులు బాగానే ఉన్నాయట. మొత్తానికి హైదరాబాద్, బెంగళూరులో దాదాపు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట..

Share post:

Latest