కేవలం ఆ ఘనత నందమూరి హరికృష్ణకు ఒక్కటే చెందుతుందా..!!

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో హరికృష్ణ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుచేత అంటే ఈ హీరో ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎప్పుడు కూడా తన హోదాని చూపించలేదు. అయితే బాలనటుడుగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ ఆ తర్వాత తన తండ్రి వెంట రాజకీయాలలోకి అడుగు పెట్టాడు కానీ సినిమాలలో చాలా తక్కువ నటించారని చెప్పవచ్చు. ఇక తన తండ్రి మరణించిన తర్వాత రవాణా శాఖ మంత్రిగా హిందూపురం ఎమ్మెల్యేగా కొద్దిరోజులు మాత్రమే బాధ్యతలను చేపట్టాడు.Nandamuri Harikrishna, TDP leader and actor, dies in accidentఅయితే ఆ తరువాత 50 ఏళ్ల వయసులో కూడా తన పాపులారిటీ కొనసాగించారు హరికృష్ణ. ఒకవైపు బాలకృష్ణ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా హరికృష్ణ మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలా 50 ఏళ్ల వయసులో మళ్లీ హీరోగా మారారు. దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత నాగార్జున,హరికృష్ణ కాంబినేషన్లో వచ్చిన సీతారామరాజు సినిమా లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని వైవియస్ చౌదరి దర్శకత్వం వహించారు. దీంతో హరికృష్ణ నీ మళ్ళీ సినిమాల్లోకి తీసుకువచ్చే ఘనత ఈయనకే దక్కిందని చెప్పవచ్చు.The life and career of Nandamuri Harikrishna | Entertainment News,The  Indian Expressఇకటి తర్వాత మోహన్ బాబుతో కలిసి శ్రీరాములయ్య సినిమాలో గెస్ట్ పాత్రలో నటించి మళ్లీ విజయాన్ని అందుకున్నారు. ఇక అదే క్రమంలోని లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించి ఈ సినిమాకు కూడా ఉత్తమ నటుడుగా నంది అవార్డును అందుకున్నారు హరికృష్ణ. అయితే ఈ సినిమాకి కూడా వైవిఎస్ దర్శకత్వం వహించడం గమనార్హం. అలా మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లోని సీతయ్య సినిమా తెరకెక్కించగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇక ఆ వయసులో కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అవ్వడం అంటే అది అంత సులువైన పని కాదు.. ఈ ఘనత కేవలం నందమూరి కుటుంబంలో హరికృష్ణ కి దక్కుతుందని చెప్పవచ్చు.. చివరిగా కృష్ణతో కలిసి శ్రావణమాసం అనే సినిమాలో నటించారు హరికృష్ణ. ఆ తర్వాత కొద్ది రోజులకు రోడ్డు ప్రమాదంలో మరణించారు హరికృష్ణ.

Share post:

Latest