“ఆ టైంలో మా అమ్మ గుర్తొచ్చింది”..మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున..!!

యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగంగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను స్పెషల్ షో వేసి చిత్ర పరిశ్రమంలో ఉన్న అగ్ర పెద్దలకు చూపించారు. వారిలో ఈ సినిమా చూసిన నాగార్జున ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఈ సినిమా చూస్తుంటే నాకు కన్నీళ్లు వచ్చేసాయి అని మా అమ్మ గుర్తొచ్చిందని ఎమోషనల్ గా మాట్లాడాడు.

Sharwanand's next is Oke Oka Jeevitham

అమ్మ మీద ప్రేమ ఉన్నవాళ్లు ఈ సినిమాని తప్పకుండా చూస్తారని వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన చెప్పారు. ఈ సినిమా నాకు కన్నీళ్లు తెప్పించింది సినిమా చూసిన వెంటనే నాకు కూడా మా అమ్మను చూడాలనిపించే అంత ఎమోషనల్ అయ్యాను” అని నాగార్జున మీడియా ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు శ్రీ కార్తీక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు. ఇందులో శర్వానంద్ కు జోడిగా రీతు వర్మ నటిచింది. సీనియర్ నటి అమలా కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించడం విశేషం.

Share post:

Latest