‘యాత్ర’: లోకేష్-పవన్ రెడీ..!

రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఏ నాయకులుకైనా బాగా ప్లస్ అవుతుంది. కారులు, బస్సుల్లో తిరగడం కంటే పాదయాత్ర ద్వారా జనం మధ్యలో ఉంటే…వారి మద్ధతు ఎక్కువ దక్కుతుంది. ఈ ఫార్ములాని వాడిన ప్రతి రాజకీయ నాయకుడు దాదాపు సక్సెస్ అయ్యారు. గతంలో వైఎస్సార్ గాని, తర్వాత చంద్రబాబు, జగన్‌లు గాని పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ వైపుయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర బీజేపీకి బాగా ప్లస్ అవుతుంది.

అటు షర్మిల కూడా పాదయాత్ర చేస్తూ..తన పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తెలంగాణకు సంబంధిచింది. అయితే ఏపీలో ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ఎవరూ పూర్తిగా మొదలుపెట్టలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు..విపత్తుల సమయంలో, ఏదైనా పోరాటాలకు సంబంధించి మాత్రం ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మినీ మహానాడుల ద్వారా భారీ సభల్లో పాల్గొంటున్నారు. అయితే నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ఇది సరిపోదు. పూర్తిగా ప్రజల్లో తిరగాలి.

బలమైన జగన్‌కు చెక్ పెట్టాలంటే..అంతే బలంగా జనంలోకి వెళ్ళాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి, వారికి భరోసా ఇవ్వాలి. అప్పుడే ప్రజలు నాయకులని ఆదరిస్తారు. ఇక గత ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పాదయాత్ర చేసి..ప్రజల మద్ధతు సంపాదించుకునే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో ముందుకు రావడానికి టీడీపీ రెడీ అయింది. ఎలాగో బాబుకు వయసు మీద పడింది. అందుకే లోకేష్ చేత పాదయాత్ర చేయించడానికి రెడీ అయ్యారు.

వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర మొదలవుతుందని..మళ్ళీ 2024 మార్చి అంటే ఎన్నికల ముందు వరకు పాదయాత్ర జరుగుతుందని తెలుస్తోంది. కుప్పం టూ శ్రీకాకుళం వరకు పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది. జగన్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర ఉంటుందని అర్ధమవుతుంది. ఇటు జనసేన అధినేత పవన్ సైతం..పాదయాత్ర లేదా బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లాలని చూస్తున్నారు.

ఈయన కూడా జగనే టార్గెట్ గా ముందుకొస్తున్నారు..అలాగే జనసేన బలోపేతం కోసం ప్రజల్లోకి రానున్నారు. వాస్తవానికి ఈ దసరాకు పవన్ జనంలోకి వస్తారని మొదట ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు వాయిదా పడిందని కథనాలు వస్తున్నాయి. మొత్తానికైతే ఇద్దరు నేతలు..జగన్ టార్గెట్ గా యాత్ర ప్లాన్ చేస్తున్నారు.

Share post:

Latest