మహేష్‌బాబు మూవీ కోసం అలాంటి గొప్ప టెక్నాలజీ వాడుతున్న రాజమౌళి..!!

దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలసి ఒక సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు కానీ కథపై డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సినీ సర్కిల్‌లో వినబడుతున్న మాట. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. దీన్ని హాలీవుడ్ లెవల్‌లో రూపొందించి ఈసారి అన్ని రికార్డులను బద్దలు కొట్టాలని రాజమౌళి సిద్ధమవుతున్నాడు. అందుకు, ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాడని టాక్‌.

ఈ మూవీలో కొన్ని ఎక్స్‌ట్రార్డినరీ స్టంట్స్ ఉంటాయట. వాటిని సరికొత్త అన్‌రియల్ టెక్నాలజీతో రాజమౌళి తీయనున్నాడని సమాచారం. అలానే మోషన్-క్యాప్చర్ టెక్నాలజీ కూడా బాగా వాడనున్నాడట. మహేష్ బాబు రియలిస్టిక్ కంప్యూటర్ గ్రాఫిక్స్ రెప్లికాను సైతం ఉపయోగించనున్నాడని సినీ ఇండస్ట్రీలో వినబడుతోంది. ఇప్పటికే రాజమౌళి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు ఇటీవల ప్యారిస్‌కు కూడా వెళ్లొచ్చాడు. కాగా అతి త్వరలోనే ఒక ఫారిన్ స్టూడియో హైదరాబాద్‌లోని ఒక VFX స్టూడియోతో కలిసి కొత్త వర్క్‌ప్లేస్‌ను ఏర్పాటు చేయనుందట. అక్కడ మహేష్‌, రాజమౌళి ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతానికి కథ వివరాలు సీక్రెట్‌గానే ఉన్నాయి. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం, రాజమౌళి మొదటిసారిగా మోడ్రన్-లైఫ్ స్టోరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా భారీ రియలిస్టిక్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్లాన్ కూడా చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ కండలు తిరిగిన ఒక బాడీ బిల్డర్ లాగా ఉంటాడట. ఇక విజువల్ ఎఫెక్ట్స్ వేరే రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు. మహేష్ బాబు, రాజమౌళి ఇప్పటివరకు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. జక్కన్న తో సినిమా చేసిన ప్రతి హీరో కూడా భారీ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ రోజుల్లో కంటే ఈ రోజుల్లో సినిమాలు మరింత మంది ప్రేక్షకులకు చేరువ అవుతున్నాయి. ఒకవేళ మహేష్, జక్కన్న సినిమా మంచి కథతో తెరకెక్కిస్తే.. అది కచ్చితంగా భారత చలన చిత్ర రంగంలో ఒక సెన్సేషనల్ హిట్‌గా నిలిచిపోతుంది.