అందానికే నిర్వచనం చెప్పిన లయ కూతురు.. ఫొటోస్ వైరల్..!!

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు అంతంత మాత్రమే వస్తాయి. ఇక అలాంటి సమయంలో కూడా విజయవాడ నుంచి వచ్చిన హీరోయిన్ లయ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో ఎవరు ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. కేవలం అందం మాత్రమే కాదు తన నటన కూడా ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఇక చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆమెను అభిమానించే వారి సంఖ్య కూడా చాలానే ఉంది. వివాహం జరిగిన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైపోయిన లయ యూఎస్ లో సెటిల్ అయిపోయింది. అక్కడ తన స్నేహితులతో కలిసి చేసే డాన్స్ వీడియోలను ఎక్కువగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ మరింత యాక్టివ్ గా ఉంటుంది.Laya Shares Her Daughter Pic, Pic Goes Viral

ఇక ఈ క్రమంలోనే తాజాగా తన కూతురు శ్లోక ఫోటోలను కూడా షేర్ చేసింది. నిన్న డాటర్స్ డే సందర్భంగా లయ తన కూతుర్ని ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను అభిమానుల కోసం కూడా పంచుకుంది. ప్రస్తుతం లయ షేర్ చేసిన ఈ ఫోటోలో లయ కూతురు చాలా అందంగా అచ్చం తల్లిలాగే కనిపిస్తోంది. శ్లోక ఫోటోలు చూసిన తర్వాత కచ్చితంగా ఈమె ఇండస్ట్రీలోకి వస్తే స్టార్ హీరోయిన్ అవుతుంది అంటూ కూడా ముందే జోష్యం చెప్పేస్తున్నారు సినీ ప్రేమికులు. నిజానికి శ్లోక కూడా చూడడానికి చాలా అందంగా అందానికే నిర్వచనం చెప్పే విధంగా కనిపిస్తోంది.Laya: ఒకప్పటి హీరోయిన్ లయ కూతురు ఫొటో వైరల్.. అందానికే అందం అనేలా.. |  Senior telugu actress laya daughter beautiful photo viral - Telugu Filmibeat

తల్లికి ఏమాత్రం తీసిపోని అందంతో చూపరులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి త్వరలోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావాలి అని కొంతమంది అభిప్రాయపడుతుంటే మరి కొంతమంది కాదు కాదు ఇప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టాలని కూడా లయ అభిమానులు ఆశిస్తున్నారు. మరి తన అభిమానుల కోరిక మేరకు లయ తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

https://www.instagram.com/p/Ci7AI-8OoF6/?utm_source=ig_web_copy_link

Share post:

Latest