ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాతే రాజమౌళి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి.. ఇంత వరకు ఆయనకు ఫ్లాప్ అనేది లేదు.. ఇక బాహుబలి తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఆయన సినిమాలు దేశం దాటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. అంతేకాదు రాజమౌళి తెలుగులోనే కాకుండా దేశంలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరపైకి వస్తున్నాయి.. ఇక తెలుగు పరంగా చూసుకుంటే.. రాజమౌళి తర్వాత దర్శకుడు సుకుమార్ కే అంతటి క్రేజ్ వస్తోందని చెప్పాలి.. ఎందుకంటే ఇటీవల వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే.. సుకుమార్ ఆ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నారు..

అయితే ఒక విషయంలో మాత్రం రాజమౌళి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెనకాల ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో భారీ యాక్షన్ ఎలివేషన్స్ ఉంటాయి. వాటితోనే తన సినిమాలను మరో లెవెల్ కి తీసుకెళ్తారు రాజమౌళి. అయితే అందులో త్రివిక్రమ్ ఏం తక్కువ కాదు. తన సినిమాల్లో యాక్షన్ సీన్స్ తో పాటు మాటలు కూడా బలంగా ఉండేట్లు చూసుకుంటాడు. యాక్షన్ పై మంచి పట్టు ఉందని చాలా సార్లు నిరూపించాడు.

ఇక ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాతే రాజమౌళి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ రూ.450 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. త్రివిక్రమ్ మార్కెట్ చూసుకుంటే.. అలవైకుంఠపురంలో మూవీతో కేవలం తెలుగు భాషలోనే ఆయన రూ.200 కోట్లు రాబట్టారు.. ఇప్పుడు మహేష్ బాబు మూవీతో మార్కెట్ ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది. దాదాపు 300 కోట్ల రూపాయల రేంజ్ లో జరగవచ్చని సమాచారం..

మహేష్ బాబు సినిమాకు ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. అప్పుడే ఆ రేంజ్ లో మార్కెట్ జరుగుతుందట.. ప్రొడ్యూసర్ కి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఈ సినిమాను త్రివిక్రమ్ భారీ యాక్షన్ ఎలివేషన్స్ తో పాన్ ఇండియా స్థాయిలో తీస్తే మాత్రం రాజమౌళి తరహాతో క్రేజ్ వస్తుందని టాక్. అంతేకాదు త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్ బలంగా ఉంటాయి.. కాబట్టి రాజమౌళి రికార్ట్స్ ని త్రివిక్రమ్ బ్రేక్ చేయడం అసాధ్యమేమి కాదు.. మరీ బాక్సాఫీస్ వద్ద త్రివిక్రమ్ ఏ స్థాయిలో విజయం సాధిస్తారో చూడాలి..