సీనియర్ నటుడు చలపతిరావు గురించి ఈ కథ విన్నారా?

నిన్నటి తరానికి నటుడు చలపతిరావు బాగా పరిచయమే. అయితే నేటి తరానికి కాస్త పరిచయం చేయవలసిన అవసరం వుంది. ఈయన సుప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. ఈయన 1200 సినిమాలలో రకరకాల పాత్రలలో నటించి మెప్పించాడు. 1944లో కృష్ణాజిల్లాలోని బల్లిపర్రు గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటినుండి ఉన్నత చదువులు చదవాలని ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో ప్రోత్సహించారు. కానీ చదువు అబ్బక ఒకసారి నాటకంలో ప్రదర్శన చేస్తే హీరోలా ఉన్నావు సినిమాలలో ట్రై చేస్తే రాణించగలవు అని స్నేహితులు చెప్పడంతో చెన్నై చెక్కేసాడు.

ఆ సమయంలోనే తన స్నేహితురాలిని ప్రేమించి, ఎవరికి తెలియకుండా వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయనకి సరిగ్గా 19 సంవత్సరాలు. ఇక పెళ్లి అయ్యాక చెన్నై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. ఓ సందర్భంలో NTR గారిని కలిసి ఒక్క అవకాశం ఇప్పించగలరా? అని అడిగితే కష్టం మీరు మీ ఊరికి వెళ్లిపోండి అన్నారట. అయినా చలపతి మొండి పట్టుపట్టడంతో అప్పుడు డైరెక్టర్ తో చెప్పి ఒక చిన్న అవకాశం ఇప్ప్పించారట. ఆ తర్వాత వరుస అవకాశాలతో చలపతి దూసుకుపోవడం జరిగింది. ఈయనకు 29 సంవత్సరాలు రాగానే భార్య చనిపోవడం అతనిజీవితంలో జరిగిన పెద్ద ఘోరం.

ఇక ఈయనకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు సంతానం. ప్రముఖ నటుడు, దర్శకుడు రవి బాబు అతని కొడుకే అన్న సంగతి తెలిసినదే. పిల్లలను బాగా చదివించి అమ్మాయిలను ఫారిన్లో సెటిల్ చేశారు చలపతిరావు. ఇక అంతా కలిసినప్పుడు సొంత ఊరు బల్లిపర్రు వెళ్లి రెండు మూడు రోజులు గడుపుతారు. అయితే ఒకసారి సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఓ తప్పుడు వార్తను చూసి చలపతిరావు ఇప్పటికీ కలత చెందుతారు. ఇక ఆ విషయం సంగతి అందరికీ విదితమే.

Share post:

Latest