పుట్టినరోజు నాడే సంచల నిర్ణయం తీసుకున్న కృతి శెట్టి..!!

ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ కృతి శెట్టి. ఆ తరువాత వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తను నటించిన తాజా చిత్రాలు మాత్రం భారీ డిజాస్టర్లను చూశాయి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలన్నీ పెట్టుకొని నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఈ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదంతా ఇలా ఉండగా నిన్నటి రోజున తన పుట్టినరోజు సందర్భంగా కృతి శెట్టి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అందుకు సంబంధించి విషయాలను తెలుసుకుందాం.

Actress Krithi Shetty Biography, Career, Age and Facts - TFIPOST
కష్టాల్లో ఉన్న పేదవారికి సహాయం చేసేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.. నిష్న.. ఫీడ్ ది నీడ్ అనే ఒక సంస్థను ప్రారంభించబోతున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను స్థాపించినట్లుగా ఆమె తెలియజేసింది . ఇక విషయాన్ని కృతి శెట్టి తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఇకపోతే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఒక ఏడాది అయిన సందర్భంలోనే ఎన్నో విషయాలను తెలియజేసింది కృతిశెట్టి.. కెరీర్ తో పాటు వ్యక్తిగతంగా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకోవడం జరిగింది.

ఎవరైనా కష్టాలలో ఉన్న వారికి ఏదైనా సహాయం చేయాలని లక్ష్యంతోనే ఈ సంస్థను స్థాపించినట్లు తెలియజేసింది. అయితే అందరూ తమ సంస్థకు అండగా నిలవాలని అభిమానులను సైతం కోరుకుంటుంది. ఇక ఆమె అభిమానులు కూడా తన బర్తడే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేపట్టాలని కూడా పిలుపునిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక తను స్థాపించిన సంస్థ ద్వారా పేదలకు అవసరమైన నిత్యవసర సరుకులు , దుస్తులు ఇతర వాటిని కూడా అందిస్తామని తెలియజేస్తుంది. దీంతో ఆమె గొప్ప మనసుని పొగడ్తలతో ముంచేస్తున్నారు ప్రేక్షకులు.

Share post:

Latest