కంటిన్యూగా నాలుగు గంటలు అదే పని.. ఈ స్టార్ జంట ఓపికకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!?

ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్స్, స్టార్ హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీస్ సామాన్యులు అందరూ కూడా తమ ఫిజికల్ ఫిట్నెస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అంతకుముందు పెద్దగా పట్టించుకోనటువంటి వాళ్ళు కూడా కరోనా తర్వాత తమ ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది చాలా మంచి విషయమే కానీ అతిగా చేస్తే ఏదైనా ప్రమాదకరమే అని ఇప్పటికే మనకు పలువురు సెలబ్రిటీ మరణాలు చెబుతున్నాయి. కాగా ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ ఫిట్ గా ఉండడానికి జిమ్ చేస్తున్నారు. అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నారు. యోగా చేస్తున్నారు .

అన్ని ఆరోగ్యానికి మంచిదే కానీ ఏదైనా సరే పరిమితికి మించి చేస్తే అది హానికరంగా మారుతుంది. అలా మనకు ప్రూవ్ చేసింది కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం. ఈయన తన శక్తికి మించి చేసిన జిమ్ వర్క్ అవుట్స్ కారణంగా ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చి చిన్నవయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. ఈ విషయం ఇప్పటికీ అభిమానుల గుండెల్లో తీరని శోకాన్ని మిగులుస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ బాలీవుడ్ లో స్టార్ జంట కంటిన్యూగా విరామం లేకుండా నాలుగైదు గంటల పాటు జిమ్ చేస్తూ షాక్ ఇస్తుంది. ఎవరైనా సరే కొంచెం సేపు జిమ్ చేశాక రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మన బాడీకి విశ్రాంతి దొరుకుతుంది. అలా కాకుండా కంటిన్యూగా ఒకేసారి విశ్రాంతి లేకుండా వ్యాయామాలు చేసిన అది ఆరోగ్యానికి మంచిది కాదు .


బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కొంతకాలం ప్రేమించుకుని.. ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ చేసుకొని.. ఎట్టకేలకు ఫైనల్ గా పెళ్లి చేసుకుని ఇప్పుడు భార్యాభర్తలుగా మన ముందు నిలిచారు. ప్రజెంట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ జంట బిహేవియర్. ఖచ్చితంగా ఈ జంట ఉదయం లేవగానే నాలుగైదు గంటలు కంటిన్యూగా వ్యాయామాలు వర్కౌట్స్ చేస్తున్నారట . ఇది ఆరోగ్యానికి మంచిదే ..అయితే విశ్రాంతి లేకుండా చేయడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. అంతేకాదు ఈ జంట ఓపికకి హాట్సాఫ్ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఎక్కువ చేయకండి రా అలసిపోతారు అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest