కమలహాసన్ భారతీయుడు2…. సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్…!

లోకనాయకుడు కమలహాసన్ గ‌త‌ కొంతకాలంగా ఆయన సినిమాలు హిట్ అందుకోలేకపోతున్నాయి. తాజాగా వచ్చిన విక్రమ్‌ సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కమలహాసన్. ఈ సినిమాను యువ దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌ చాలా డిఫరెంట్గా తెరకెక్కించాడు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీస్తానని లోకేష్ కనకరాజ్‌ మొదట లోనే చెప్పాడు. అందులో కమలహాసన్ తో పాటు తమిళ్ అగ్ర నటుడు సూర్య కూడా నటించబోతున్నాడు.

Vikram Box Office: Kamal Haasan Led Thriller Achieves Unbelievable Feat For  A Tamil Film In Kerala - Deets Inside

కమలహాసన్ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారతీయుడు2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వ‌చ్చిన‌ భారతీయుడు కి సిక్వల్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మొదలై రెండు సంవత్సరాలు అవుతున్న మధ్యలో కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్లో శంకర్ శరవేగంగా తీస్తున్నాడు.

Indian 2 Controversy Takes An Unexpected Turn; Lyca Productions Writes To  Film Chambers: Report - Filmibeat

వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేస్తామ‌ని మేకర్స్‌ చెప్తున్నారు. ఈ సినిమాకి స్టోరీ అందించిన జయ మోహన్ తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పాడు. ‘ఈ సినిమాని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నామని. ఈ సినిమాని ఏకంగా మూడు గంటలకు పైగా నిడివి ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పాడు’. ఆయన చెప్పిన దానిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. భారతీయుడు సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే ఈ క్రమంలోనే భారతీయుడు2 కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు చూడాలి ఈ సినిమా విడుదలై ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో…?

Share post:

Latest