అనసూయ కెరియర్ దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందా..!!

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాంకర్ గా నటిగా పేరు సంపాదించింది అనసూయ భరద్వాజ్. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. తన మీద వచ్చే ట్రోలింగ్ పైన , తనకు సంబంధించి ఏదైనా విషయాన్ని నైనా సరే సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా అనసూయ పేరు బాగా వినిపిస్తూ ఉన్నది. దీంతో అనసూయ తనపై ట్రోలింగ్ చేసే వారి పైన కేసు వేయడం కూడా జరిగింది. దీంతో ఆమె పరోక్షంగా తన కెరీర్ ని దెబ్బకొట్టేందుకు చాలా మంది కుట్ర చేస్తున్నారని కూడా వారిని వదిలిపెట్టనని పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

Tollywood Twitter war: Anasuya Bharadwaj warns Deverakonda's fansఅనసూయ గతంలో విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడంతో ఈ ఘర్షణ మొదలైందని చెప్పవచ్చు.. దాని తర్వాతనే అనసూయ పై నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి.. ఇక దీంతో వియ్ దేవకొండ అభిమానులు ఆంటీ అని పిలుస్తూ అవమానించారు. ఇక తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఇందులో లాగారనే.. అందుకే నేను కేసు నమోదు చేస్తున్నాను.. మీరు నాతో పెట్టినందుకు మీరు చింతించే రోజు కచ్చితంగా వస్తుంది అని ఆమె ఎమోషనల్ అవడం కూడా జరిగింది.There is no need to change for anyone!.. Anasuya's post is viral »  Jsnewstimesఇక అనసూయ పై చేసిన ట్రోలింగ్స్ వారంతా నకిలీ ప్రొఫైల్స్ లో కలిగిన వారు తెలియజేసింది. దీన్ని బట్టి చూస్తే అనసూయ పైన పక్కా ప్లానింగ్ తోనే ఇదంతా చేస్తున్నారని ఆమె అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అనసూయ పుష్ప -2 సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనసూయ పైన వచ్చిన ఇలాంటి వివాదాలు ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందా.. లేదా అనే విషయం చూడాలి.

Share post:

Latest