తనలాగా ఎవరు కాకూడదని సమంత అలాంటి పని చేస్తోందా..?

సమంత వివాహానికి ముందు చాలా సంతోషంగా ఉండేది. వివాహం తర్వాత నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో సంతోషంగా గడిపిన సమంత ఉన్నట్టుండి విడాకులు తీసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సమంత ఇలా విడాకులు తీసుకోవడం వెనుక కారణాన్ని వెల్లడించలేదు. కానీ ఆమె మానసిక ఒత్తిడి నీ ఇప్పటికీ అనుభవిస్తున్నట్లు తన వ్యవహారాల ద్వారా చెప్పకనే అర్థమవుతుంది. ఇకపోతే ఎంతోమంది ట్రోల్స్ కు కాంట్రవర్సీలకు గురైన సమంత ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తోందని సమాచారం.

About Us | Pratyusha Support
ఇకపోతే సమంత ఒక క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తుందని సమాచారం. ఇకపోతే సమంత ప్రస్తుతం తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి.. మరోవైపు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటూ మానసిక ప్రశాంతత కోసం ఎదురుచూస్తోంది. అందులో భాగంగానే ఒక వేద పాఠశాలలో పూజలు కూడా చేసినట్లు సమాచారం. ఇకపోతే సమంత ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూనే.. ఈ క్రమంలో నిరుపేదలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నారని ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇటీవల గురుకుల ఆశ్రమానికి భారీగా విరాళాలు ఇవ్వగా.. ఇప్పుడు మరొక ఆశ్రమానికి ఆవులను కూడా విరాళంగా ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక అంతేకాదు చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన సమంత గంగోత్రి.. యమునోత్రి.. బద్రీనాథ్.. కేదార్నాథ్ ను సందర్శించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించింది. ఇక పోతే ప్రత్యూష ఫౌండేషన్ ను కూడా నడిపిస్తోంది ఇక తనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని మానసిక ప్రశాంతతను వెతుక్కోవాల్సి అవసరం లేకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అణగారిన మహిళలు మరియు పిల్లలకు అండగా నిలుస్తోంది సమంత .ఇక ఇప్పుడే పేదలకు తన వంతు సహాయం కూడా చేయడానికి విరాళాలు ఇవ్వనున్నట్లు సమాచారం.. ఇకపోతే సమంత ఒకవైపు సినిమాలలో సంపాదిస్తున్న డబ్బులు ఇలా పేదల కోసం పంచి పెడుతూ ఉండడంతో ఆమెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share post:

Latest