అలా చేస్తే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ : పరుచూరి గోపాలకృష్ణ..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉండగానే.. మరొకవైపు రాజకీయ రంగంలో దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తన అన్న బాటలోనే తాను కూడా జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనే తపనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ప్రజలతో మమేకం అవడం వారి కష్టాలను తెలుసుకొని వారికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి కూడా చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్.. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అంటే అలా చేయాల్సిందే అంటూ కొన్ని విషయాలు తెలిపారుParuchuri gopalakrishna suggests pawan kalyan to act again in movies | పవన్  కళ్యాణ్ ఇలా చేయాలి... సీనియర్ రచయిత సలహా– News18 Telugu

పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పాఠాలు పేరుతో యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తన సినీ కెరియర్ లో 27 సినిమాల వరకు చేసి ఉంటాడు. ఇక ఒక సమయంలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా వెళ్ళాడు.. ఇక ఆ తర్వాత డిజాస్టర్ లను కూడా మూట కట్టుకున్నాడు. ఇక అత్తారింటికి దారేది సినిమాతో ప్రజలను తికమక పెట్టేశాడు. మళ్లీ ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్టు ఎంచుకుంటున్నాడు.. సినిమా వేరు .. రాజకీయం వేరు.. ఇక కర్ణాటక, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. ఒక పార్టీకి సపోర్టుగా నిలబడడం వేరు.. ఒకసారి పార్లమెంటుకు వెళ్లి వద్దాం అనుకోవడం వేరు.. సమాజాన్ని తన దృక్పథంలో మార్చాలనే ఆశయం ఉండడం వేరు. ఆ ఆశయం పవన్ కళ్యాణ్ కి ఉంది.Paruchuri Gopala Krishna harsh words for Prabhasఎవరు వచ్చినా రాకపోయినా తన పోరాటం తాను చేసుకుంటూ పోయే వాడే వీరుడు.. 2019 ఎన్నికల్లో పవన్ తనకంటూ అస్తిత్వాన్ని నిరూపించుకుందాం అని నిలబడితే.. ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశయంతో 2024 లో జరిగే ఎన్నికల కోసం ఆయన ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.. ఎన్టీఆర్, కృష్ణ అధికారంలోకి రావడానికి బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, ఈనాడు వంటి సినిమాలను ఎంచుకొని మంచి నాయకుడిగా ప్రజలలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక అద్భుతమైన చిత్రాన్ని ఎంచుకోవాలి . ప్రజల్లోకి వెళ్లే విధంగా చేయగలగాలి. ఓటర్లు ఎప్పుడూ ఒకే వైపు ఉండరు. వాళ్లకు కొన్ని ఆశయాలు, ఆశలు ఉంటాయి.వాటిని ఎవరు నెరవేరుస్తారో వారి వైపే మొగ్గు చూపుతారు. ఇక పవన్ కళ్యాణ్ ఆశయాలు చట్టసభల్లోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను.. ఆయన నిజంగా సీఎం అవుతారని ఆకాంక్షిస్తున్నాను అంటూ గోపాలకృష్ణ తెలిపారు.