నాని ఫ‌స్ట్ సినిమాకు షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ఇచ్చారా…!

నేచుర‌ల్ స్టార్ నాని ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఈ రోజు స్టార్ హీరో అయిపోయాడు. ఈ రోజు నాని సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంది. నానికి క్లాస్ ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో నాని బిజీగా ఉన్నాడు. న‌ట‌న‌పై ఇష్టంతో సినిమాల్లోకి వ‌చ్చిన నాని ముందుగా బాపు, రాఘవేంద్రరావు వంటి డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొద్ది రోజులు వ‌ర్క్ చేశాడు.

Actor Nani Family with his Wife and Son Beautiful Moment | Anjana | Arjun | Filmi Frame - YouTube

బాపు ద‌గ్గ‌ర శ్రీకాంత్ – స్నేహ రాధాగోపాలం సినిమాతో పాటు బాల‌య్య శ్రీరామ‌రాజ్యం సినిమాకూ అసిస్టెంట్‌గా ఉన్నాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్న నానికి అష్టా చెమ్మ సినిమాలో హీరోగా ఛాన్స్‌ వచ్చింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో నానికి జోడీగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది.

Happy Birthday Swathi: From Ashta Chamma to Karthikeya, 5 films of the actress that prove why she is an extraordinary performer | The Times of India

ఈ సినిమాలో నాని కామెడీ టైమింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయి ఎంజాయ్ చేశారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వ‌డంతో నానికి వ‌రుస‌గా మంచి ఛాన్సులు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరో అయిన నాని ఒక్కో సినిమాకు దాదాపు 8 నుంచి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అయితే నాని ఫ‌స్ట్ మూవీ అష్టాచెమ్మాకు ఎంత పుచ్చుకున్నాడ‌న్న‌ది కాస్త ఇంట్ర‌స్టింగ్ విష‌య‌మే..!

Nani's interesting move for Dasara

ఆ సినిమాకు ముందు వ‌ర‌కు నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసి హీరో అయ్యాడు. అసిస్టెంట్లుగా ప‌నిచేసిన వారికి రెమ్యున‌రేష‌న్లు ఉండ‌వు. వాళ్ల‌కు కేవ‌లం భోజ‌నం, ఇత‌ర స‌దుపాయాలే ఉంటాయి. నాని అసిస్టెంట్‌గా ఉంటూ హీరో కావ‌డంతో ఫ‌స్ట్ సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ట‌. అయితే నాని ల‌క్ ఏంటంటే ఈ సినిమా హిట్ కావ‌డంతో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి.

Share post:

Latest