కావాలని తొక్కేశారు.. సినీ ఇండస్ట్రీపై హీరో ఆకాష్ షాకింగ్ కామెంట్స్..

దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన ‘ఆనందం’ సినిమాతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హీరో ఆకాష్.. మొదటి సినిమీతోనే పెద్ద హిట్ అందుకొని మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా కలెక్షన్స్ పరంగా, సినిమా పరంగా మంచి సక్సెస్ సాధించడంతో.. మొదటి సినిమాతోనే స్టార్ గా మారాడు.. అయితే హీరో ఆకాష్ తర్వాత నటుడిగా ఎక్కువ రోజులు కొనసాగలేకపోయాడు. మొదటి సినిమా విజయం తర్వాత ఆకాష్ తో సినిమా చేసేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడ్డారు. కానీ ఆకాష్ మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. కొత్త దర్శకులతో, కష్టాల్లో ఉన్న నిర్మాతలతో మూవీస్ చేశాడు. అవి పెద్దగా విజయం సాధించలేకపోయాయి.

దీంతో తమిళం, కన్నడ ఇండస్ట్రీల్లో నటించాడు.. అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయాడు..అక్కడ కూడా అలాంటి పరిస్థితులే ఎదుకావడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు వచ్చాడు. తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు.. గోరింటాకు, అందాల రాముడు, నవవసంతం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. దీంతో ఆకాష్ కి మళ్లీ అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ‘స్వీట్ హార్ట్’ అనే సినిమాకు దర్శకత్వం వహించి అందులో నటించాడు..ఆ చిత్రం పర్వాలేదనిపించింది..ఇలా కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ఆకాష్..

అయితే గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆకాష్ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో ఆకాష్ కు తెలుగు మూవీస్ లో ఎక్కువగా ఎందుకు కనిపించలేదని ప్రశ్న అడిగారు.. దీంతో ఆకాష్ షాకింగ్ సమాధానం చెప్పాడు. ‘నా మొదటి సినిమా సక్సెస్ అయ్యింది. దీనిని ఇండస్ట్రీలో కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. అందుకే నన్ను కావాలని తొక్కేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ వాడుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. అందుకే తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేశాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగాలంటే.. కనీసం ఒక్కరైనా సపోర్ట్ గా ఉండాలి. లేకపోతే ఇక్కడ రాణించడం కష్టం’ అంటూ ఆకాష్ ఇండస్ట్రీ గురించి చెప్పుకొచ్చారు.

Share post:

Latest