అబ్బా అనిపించేలా హెబ్బా బోల్డ్ నిర్ణయం…ఇక కింద మీద ఊపే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు ఆయన హెబ్బా పటేల్ త‌న హాట్ హాట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో చూసి ఆమె ఫ్యాన్స్ వెర్రెక్కి పోతున్నారు. ఈ ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన `కుమారి 21ఎఫ్` సినిమాతో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా హిట్ అవడంతో ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు వ‌చ్చాయి. ఇక అందులో భాగంగానే హెబ్బా పటేల్ నిఖిల్ హీరోగా తరికెక్కిన `ఎక్కడికి పోతావు చిన్నవాడా` అనే సినిమాతో మరో సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఆ తరువాత మాత్రం ఎన్నో మూవీస్‌లో నటించిన హెబ్బా పటేల్ కు అంతా భారీ విజయం దక్కలేదు. అంత క్రేజీ హీరోయిన్ గా మారినా సరే హెబ్బా పటేల్ స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఇటీవ‌ల‌ హెబ్బా `ఓదెల రైల్వే స్టేషన్`అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ ని డి గ్లామర్ రోల్ లో చూపించ‌డంతో ప్రేక్షకులకు అంత నచ్చలేదు. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయింది.

 

అయితే రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన `రెడ్` సినిమాలో హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో నటించి అందర్నీ అలరించింది. హెబ్బా పటేల్ తాజాగా `శాసనసభ` అనే పాన్ ఇండియా మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. వేణు మడికంటి డైరెక్షన్లో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటిస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక సాంగ్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. `రెడ్` మూవీ లో స్పెషల్ సాంగ్ లో అభిమానుల్ని అలరించిన హెబ్బా శాసనసభ సినిమా ఐటెం సాంగ్‌తో ఎంత‌లా ఊపేస్తుందో ? చూడాలి.

Share post:

Latest