బాలయ్య అభిమానులకు పండగ చేసుకొనే వార్త… వారసుడు వచ్చేస్తున్నాడు!

తెలుగు పరిశ్రమలో దాదాపు స్టార్ హీరోల వారసులందరూ నటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమ అభిమాన హీరో అయినటువంటి నందమూరి అందగాడు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నందమూరి వారసుడు లాంచ్‌కు టైమ్ వచ్చేసినట్టు తెలుస్తోంది. అవును.. బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి రెడీ అయ్యారట. అంతే కాకుండా మోక్షజ్ఞ మొదటి చిత్రానికి డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు.

కాగా బాలయ్య నటిస్తున్న ఏదో ఒక సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే మిగులుతోంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో తనయుడి ఎంట్రీ ఉంటుందని అంతటా అనుకున్నారు, కానీ నిరాశే మిగిలింది. ఇక ఫైనల్‌గా త్వరలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఎందరో స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఆఖరికి బాలయ్యకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇస్తున్న బోయపాటితోనే మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే అది కూడా రూమర్ అని ప్రస్తుతం తేలిపోయింది. అవును… ఆమధ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు కూడా వినబడింది. అయితే ఇపుడు ఓ పేరు తాజాగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు… నాని హీరోగా ‘శ్యామ్ సింగ రాయ్’ తెరకెక్కించిన ‘రాహుల్ సాంకృత్యాన్’ అవును తాజాగా ఇతడి పేరు సోషల్ మీడియాలో నానుతోంది. మోక్షజ్ఞను ఓ మినిమమ్ గ్యారెంటీ లవ్ డ్రామా సినిమాతో లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నాడట. దీని గురించి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇందులో నిజమెంతుందో తెలియదు మరి.

Share post:

Latest