డాన్సర్ ఝాన్సీ భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..!!

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంతోమంది టాలెంట్ ఉండే వారిని తీసుకువస్తూ ఉన్నది మల్లెమాల సంస్థ. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం ఇందులో డ్యాన్సర్ ఝాన్సీ వచ్చి డ్యాన్స్ వేయడంతో ప్రతి ఒక్కరు ఆమె డాన్స్ ని చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పల్సర్ బైక్ అనే పాట ఉత్తరాంధ్ర జానపద గీతానికి ఈటీవీలో తన డ్యాన్స్ తో అదరగొట్టి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకొంది డ్యాన్సర్ ఝాన్సీ. ఈమె గాజువాక డిపో కండక్టర్ అయినప్పటికీ కూడా.. డాన్స్ అంటే ఇష్టం ఉండడంతో ఈమె ఇలా చేస్తూ ఉంటుంది.Gajuwaka Conductor Jhansi, Dancer Jhansi: The lady conductor who shook  Sridevi's drama company real life.ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ లో పలు ఇంటర్వ్యూ ద్వారా ఇమే చాలా బిజీగా మారిపోయింది ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇక ఝాన్సీ చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు గొడవపడి విడిపోవడం జరిగిందట. ఇక ఝాన్సీ తన తల్లి దగ్గర ఉంటూ తన తల్లి తమ్ముడి ని తన డ్యాన్స్ తోనే కష్టపడి పోషిస్తూ ఉండేదట. ఇక ఝాన్సీ తల్లి కూడా కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేదట. ఝాన్సీ చిన్న వయసు నుండే డాన్స్ నేర్చుకొని స్టేజిలపైన పర్ఫామెన్స్ చేస్తూ ఉండేది. అలా ప్రతిరోజు 150 రూపాయలు మాత్రమే సంపాదించేదట.🤩Jhansi | dance | in Sridevi | drama company - YouTubeఅయితే కండక్టర్ జాబ్ వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యతలను తీసుకొని తన తమ్ముడిని ఎంబీఏ కూడా చదివించిందట. తన కుటుంబాన్ని తన తండ్రి వదిలేస్తే తను డ్యాన్స్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించడం తప్పు పని కాదని తెలియజేసింది.

డ్యాన్స్ చేసే అమ్మాయిలను ఎప్పుడు తప్పుగా చూడకండి తక్కువగా చూడకండి అని తెలియజేసింది. ఇక డ్యాన్స్ ర్ ఝాన్సీ తన చిన్న వయసులోనే క్లాస్మేట్ అయినా వ్యక్తిని ఇంటర్లో ప్రేమించి వివాహం చేసుకుంది. ఝాన్సీ భర్త కూడా డ్యాన్సర్ ఇద్దరు కలిసి జెమినీ టీవీ మాటీవీ ఇలా పలు చానల్స్ లో డ్యాన్స్ షోలు చేస్తూ ఉండేవారట.

Share post:

Latest