యూట్యూబ్ ద్వారా శ్రీ రెడ్డి సంపాదన ఎంతో తెలుసా..?

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు అందాలు చూపించడంలో కూడా ఈమె తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు.. ఇక లో అందాలను చూపిస్తూ కుర్ర కారుకు చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ ఏదైనా ఒక విషయంలో తల దూర్చింది అంటే ఇక పుట్టపూర్వతారాలు కూడా బయటకు లాగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు . ఇప్పటికే సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరిని తన మాటలతో ఒక ఆట ఆడుకున్న శ్రీరెడ్డి ఒకానొక సమయంలో కొంతమంది హీరోలు తనను వాడుకొని వదిలేశారు అంటూ వారి పేర్లను బయట పెట్టడమే కాకుండా వారి పర్సనల్ చాటింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా మీడియాకు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

sri reddy is busy on cooking goat curry video goes viral sri reddy,  tollywood, cooking video, viral, social media, villege - Telugu Goat Curry, Sri  Reddy, Tollywood, Villege

ఇక ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ చెన్నైలోని తన స్నేహితురాలి తోటలో గుమగుమలాడే వంటలు తయారు చేస్తూ మరొకవైపు వయ్యారాలు వొలకబోస్తూనే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాలను తన జీవితంతో పోల్చుకుంటూ ముచ్చటిస్తూ ఉంటుంది. ఇకపోతే యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీని కూడా సంపాదించుకున్న శ్రీరెడ్డి యూట్యూబ్ ద్వారా నెలకు బాగా సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరెడ్డి ఒక్క యూట్యూబ్ ద్వారానే నెలకు 8 లక్షల రూపాయలు సంపాదిస్తోందట. ఇక యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీగా సంపాదిస్తూ పాపులారిటీని కూడా దక్కించుకుంది..

ఈ మధ్యకాలంలోనే రాయలసీమ రాగిసంకటి.. నాటుకోడి.. పీతలు, రొయ్యలు, ఎండు చేపలు వంటి పల్లెటూరు వంటలు చేసి.. చూసే చూపరులకు కూడా గుమగుమలాడించింది. ఇక అంతేకాదు వంటింటి చిట్కాలకు సంబంధించిన వీడియోలను కూడా యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ మరింత మంది గృహిణులను తన సబ్స్క్రైబర్లుగా మార్చుకుంది. ఈమెకు ఒక్క యూట్యూబ్ ద్వారా ఏకంగా 4 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది.

Share post:

Latest