రాజమౌళితో ఈమెకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? ఆశ్చర్యపోవాల్సిందే..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది బంధువులు ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు కొందరైతే తెలియని వాళ్ళు బోలెడు మంది. బ్లడ్ రిలేషన్ కొందరైతే దూరపు చుట్టాలు కొంతమంది చాలా వరకు ప్రస్తుత జనరేషన్ కి ఒకప్పటి తరాల రిలేషన్స్ తెలీయదు. ఇప్పుడిప్పుడే అవి బయటపడుతున్నాయి అలా ఓ ఇంట్రెస్టింగ్ రిలేషన్ షిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి అపజయమెరుగని దర్శకుడిగా సక్సెస్ ..సక్సెస్ ని తన ఇంటిపేరుగా మార్చుకునారు.

ఈ జక్కన్న ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు ..వేసుకోడు కూడా అంత ధీమాగా ఉన్నాడు ఆయన డైరెక్షన్ పై. రాజమౌళి డైరెక్షన్ చేస్తే ఎలాంటి సినిమా అయినా సరే హిట్ అవ్వాల్సిందే.. ఆయన చేతిలో పడ్డ ఏ హీరో అయినా స్టార్ హీరో లిస్టు లోకి యాడ్ అవ్వాల్సిందే. అంత గట్టిగా నమ్ముతున్నారు సినీ జనాలు. అంత మంచి పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. అంతే కష్టపడతాడు ఈ జక్కన్న . కాగా రాజమౌళి మొదట సీరియల్ డైరెక్షన్ చేశారన్న సంగతి చాలామందికి తెలియదు.

అయితే, రాజమౌళినే తన నటనతో మెప్పించింది ఈ నటి పావని. పావని అంటే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ గాయత్రి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు .అంత బాగా ఆమె ఒరిజినల్ పేరు కన్నా సీరియల్ పేరుతోనే పాపులర్ అయింది , చక్రవాకం సీరియల్ అందరికీ గుర్తుంది కదా. అబ్బో మర్చిపోయే సీరియల్ నా అది మంజులా నాయుడు కెరియర్ ని మలుపు తిప్పిన సీరియల్. అప్పట్లో ఈ సీరియల్ టీవీలో వస్తుందంటే ఆడ-మగ, చిన్న-పెద్ద , తేడా లేకుండా టీవీకి అతుక్కుపోయి చూసేవారు ఈ చక్రవాకం.

అప్పట్లో ప్రతి ఇంట్లోనూ చక్రవాకం సీరియల్ మారుమ్రోగిపోయేది. చక్రవాకం సీరియల్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన నటి పావని తన అందం తన నటనతో మనల్ని కట్టిపడేసింది. కాగా గాయత్రి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లోని శాంతినివాసం సీరియల్ లో నటించడం ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.

అంతేకాదు ఆమెను వెండి తెర పై ఇంట్రడ్యూస్ చేసింది కూడా రాజమౌళినే. సింహాద్రి సినిమాలో ఆమెకు ఓ ఇంపార్టెంట్ రోల్ లో పెట్టి ఆమె నటనకు మైమరిచిపోయాడు. అప్పట్లో జక్కన్న పావని నటనను భలే మెచ్చుకున్నాడు. అది నెగిటివ్ రోల్ అయినా పాజిటివ్ రోల్ అయినా పావని యాక్టింగ్ సూపర్ అంటూ జక్కన్న పొగిడేసిన తీరు జనాలను ఆశ్చర్యపరిచింది. అలా పావని సినీ కెరియర్ తో రాజమౌళికి ముడిపడింది.

Share post:

Latest