సినిమా షూటింగ్లో ప్రమాదం వల్లే ఈ హీరో కెరియర్ ఇలా అయ్యిందా..!!

తెలుగు ఇండస్ట్రీలో హీరో శ్రీరామ్ 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అన్ని భాషలలో కూడా నటించి మంచి నటుడుగా గుర్తింపు పొందాడు. ఇప్పటికీ కొన్ని సినిమాలలో నటిస్తు ఉన్న కూడా నటుడుగా గుర్తింపు రాలేదు. మొదట” ఒకరికి ఒకరు” అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ మొదట తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదట తను నటించిన తమిళ చిత్రంతోనే మంచి గుర్తింపు పొందించుకున్నాడు. తమిళంలో పలు అవకాశాలు కూడా దక్కించుకున్నారు ఈ హీరో.Actor Srikanth Family Photos - Telugu Actor Sriram Family Photos - YouTube

ఇక 2007వ సంవత్సరంలో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో వెంకటేష్ ఫ్రెండ్ గా నటించి మంచి మార్కులు సంపాదించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన శ్రీరామ్ జీవితాన్ని మార్చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో త్రిష కూడా నటించింది. త్రిష ఈ సినిమాలో ఒక పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో.. శ్రీరామ్ పక్కన ఎఫెక్ట్ కోసం నిప్పు పెట్టాల్సి వచ్చిందట. అయితే పొరపాటున ఆగిపో శ్రీరామ్ ముఖానికి చాలా బలంగా తగలడంతో ఆయన కనుబొమ్మలు ,పెదాలు, చిగుళ్ళు కనురెప్పలు అన్ని కాలిపోయినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు శ్రీరామ్.Tollywood Actor Sriram Krishnamachari Family Photos - Lovely Telugu

దీంతో ఇతని చర్మం కూడా కాలిపోయినట్లు తెలియజేశారు. అలా ఈ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదం వల్ల రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరమయ్యారట శ్రీరామ్. శ్రీరామ్ కెరియర్ పరంగా 40 కి పైగా సినిమాలలో నటించారు. ఎక్కువగా తమిళంలోని కొన్ని సినిమాలు నటించడం విశేషం. ఇక తాజాగా ఈ ఏడాది టెన్త్ క్లాస్ డైరీ అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇవే కాకుండా ప్రస్తుతం 5 సినిమాలు షూటింగ్లో ఉన్నట్లు సమాచారం. శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత శ్రీరాములు మార్చుకున్నారు.

Share post:

Latest