ఆలీ తో సరదాగా షో కి కళ్లు చెదిరే పారితోషికం తీసుకుంటున్న ఆలీ..సుమ కూడా వేస్ట్..!?

ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్నా ఆలీతో సరదాగా టాక్ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. అయితే కొన్నాళ్ల క్రితం ఈటీవీలో ఆలీతో జాలీగా అనే గేమ్ షో కూడా ఆలీనే చేసేవారు. అయితే ప్రస్తుతం `ఆలీతో సరదాగా` అనే టాక్ షో చేస్తున్నారు. అయితే కొన్ని వందల ఎపిసోడ్లు ప్రసారమవుతున్నాయి.
ఆలీ ఒక సినీ నటుడిగా ఎంత బిజీగా ఉంటారు. అయితే ఒకేసారి ఐదు నుండి పది సినిమాలు చేస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అలాంటి ఆలీ ఈ టాక్ షో కి ఓకే చెప్పడానికి గల కారణం అనేది అందరికీ ఆసక్తి కలిగించే విషమనే చెప్పాలి.

గతంలో దీనిపై స్పందిస్తూ ఆలీ ఎంత వెండితెర పైన నటించిన కూడా బుల్లితెరపై కనిపించడం కూడా త‌న‌కు ఆసక్తి అంటూ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ కి చెందిన‌ తనకు ఇష్టమైన ఒక వ్యక్తి బుల్లితెరపై కనిపిస్తున్నాడ‌ని… అందుకే తాను కూడా బుల్లితెరపై కనిపించాలని ఉద్దేశంతో ఈ షో కి కమిట్ అయ్యాడున‌న్నాడు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి ఆలీ చేస్తున్న `ఆలీతో సరదాగా` అనే టాక్ షో ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనేది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఆలీ మూడు, నాలుగు గంటల్లో ఒక్కో ఎపిసోడ్ పూర్తి చేస్తాడ‌ట‌. అయితే ఆయన ఒక్కో ఎపిసోడ్‌కు 6.50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటాడ‌ట‌. నెలలో నాలుగు ఐదు రోజులు మాత్రమే ఆలీ ఈ కార్యక్రమానికి టైం కేటాయిస్తాడట. ఇలా నెలలో 20 లక్షల వరకు ఈ కార్యక్రమం ద్వారా రెమ్యున‌రేషన్ వస్తుంది. అందులో ట్యాక్స్‌లు పోగా తన స్టాఫ్ కి జీతాలు ఇవ్వగా ఇక 15 లక్షల వరకు అటు ఇటుగా మిగులుతుందట.

Share post:

Latest