స్టార్ సింగర్ పై చిన్మయి సంచలన కామెంట్స్..!

సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . తెలుగు, తమిళ్, మలయాళం, కాకుండా అన్ని భాషల్లో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో సమంతకు డబ్బింగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది చిన్మయి. ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులకి తన వ్యక్తిగత జీవితం గురించి లైవ్ చాట్ లో చెప్తూ ఉంటుంది. చిన్మ‌యి సింగర్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమం బాగా ధైర్యంగా పోరాడి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.

అంతేకాకుండా ఆడవాళ్ళ గురించి సమాజంలో జరిగే వివక్ష అఘాత్యాలు దారుణాలను అమె ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా లెవనెత్తుతూ తన గళం వినిపిస్తూ ఉంటుంది. అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వార ఏ ఇబ్బంది వచ్చినా చిన్మయికి చెప్పి వారు బాధపడుతుంటారు.

ఇదే క్ర‌మంలో త‌న‌ తోటి సింగర్ కార్తీక్‌పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసినప్పుడు ఆమెకు అండగా నిలిచింది చిన్మయి. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని సింగర్ కార్తీక్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇష్యూపై మరోసారి స్పందించింది సింగర్ చిన్మయి. తాజా జరిగిన‌ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” కార్తీక్ ఇష్యూలో సీనియర్‌ సింగర్ మనో రాయభారం చేయడానికి ప్ర‌య‌త్నించాడు అని చెప్పింది. కార్తీక్ లైంగికంగా వేధిస్తున్నారని చాలామంది అమ్మాయిలు చెప్పారు. హైదరాబాద్, చెన్నైలతో పాటు స్విజర్లాండ్‌లో కూడా ఇతని బాధితులు ఉన్నారని చెప్పింది”.

“తాను సింగర్ కార్తీక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత మనో నాకు ఫోన్ చేశారు. ఎందుకమ్మా.. నువ్వు కష్టపడి వచ్చావ్.. అతను కష్టపడి వచ్చాడు.. నువ్ ఇలా చేయడం వల్ల అతని కెరియర్ నాశనం అవుతుంది అని రాయభారం చేసే ప్రయత్నం చేశాడు. అతను ఏం చేసినా పర్లేదు అనే స్టేజ్‌లో నేను లేను. మ‌నో కార్తీక్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో నాకు అర్ధం కాలేదు. పైగా కార్తీక్ నాకు సరిగమపలో కో జడ్జీగా వ‌చ్చాడు. నాకు ఈ విషయం తెలిసిన తరువాత ఏడుస్తూ ఉన్నాను.. షూటింగ్‌కి కూడా టైంకి వెళ్లే దాన్ని కాదు. కార్తీక్ నాకు ఫోన్ చేసీ.. నేను నీతో ఏం మాట్లాడలేను అని ఫోన్ పెట్టేశానంటూ.. నాటి విషయాన్ని..” మళ్లీ గుర్తు చేసుకున్నారు సింగర్ చిన్మయి.

Share post:

Latest