ఆ సమస్యతో బాధపడుతున్న అనుష్క.. అసలేమైందంటే..!!

నాగార్జున హీరోగా డైరెక్టర్ పూరి జగదాత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సూపర్. ఈ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పాటు వరుస హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక అరుంధతి సినిమా అనుష్క కెరియర్నే మార్చేసిందని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే అనుష్క ఈమధ్య కాలంలో సినిమాలు నటించడం లేదు. అయితే అందుకు గల కారణాలు కూడా ఏంటనే విషయం చెప్పలేదు ఈమే.Anushka Shetty turns 40: 9 facts about the birthday girl fans should knowఅనుష్క చివరిగా నటించిన సినిమా నిశ్శబ్దం. ఇక తర్వాత తన ఏ సినిమాలో కూడా నటించలేదు. అనుష్క ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 15 సంవత్సరాలు పైనే కావస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 40 సంవత్సరాలు.అయినా కూడా పెళ్లి ఉసే ఎత్తడం లేదు. అనుష్క పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ విషయంపై అనుష్క గాని ప్రభాస్ గాని ఇప్పటివరకు స్పందించలేదు.A Throwback Fan Letter To Anushka: How Sweety Inspired All Of Us Through  Size Zero Movie - Chai Bisketకానీ అనుష్క తల్లిదండ్రులు మాత్రం ఆమెకు త్వరగా వివాహం చేస్తే మంచిది అన్నట్లుగా చూస్తున్నట్లు సమాచారం. కానీ అనుష్క ఏదో ఒకటి చెప్పి ప్రతిసారి పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. అనుష్క తన వివాహాన్ని వాయిదా వేయడానికి వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్లు సమాచారం. అదేమిటంటే తన జాతకంలో ఏదో దోషం ఉండడం వల్లే ఆమె ఇంకా వివాహం చేసుకోలేదని వార్త వైరల్ గా మారుతుంది. ఇక అందుకు తగ్గట్టుగా దోషపరిహారం చేసుకున్న తర్వాతనే అనుష్క పెళ్లి చేసుకుంటుందని సమాచారం. అయితే అనుష్క సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనుష్క ఏదో సమస్య వల్ల చాలా బరువు ఎక్కడంతో తన బరువు తగ్గిన తర్వాతే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి అనుష్క తన పెళ్లిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Share post:

Latest