అమలాపాల్ తెలుగు దర్శకులను…. అంత మాట అనేసిందేంటి…!

మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సౌత్ లో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్గా పేరును సంపాదించుకోంది. అమలాపాల్ తెలుగులో స్టార్ హీరోలైన రామ్ చరణ్ వంటి హీరోలతో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఈమె సౌత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బానే పెంచుకుంది. అమలాపాల్ కోలీవుడ్ దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అమలాపాల్ సినిమాలకు కొంతదూరంగా ఉంది. అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆటైంలో లో అమలాపాల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇప్పుడు అమలాపాల్ వరుస‌ పెట్టి సినిమాలు చేసుకుంటూ మళ్ళీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. వీటితోపాటు అమల సొంత బ్యానర్‌ను పెట్టి సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. తాజాగా ఆమె బ్యానర్ లో ఆమె నటించిన కడవర్ సినిమా ఆమె బ్యానర్ లో తెరకెక్కింది.ఈ సినిమా ఆగ‌స్ట్ నెల‌లో విడుద‌లై బాక్స‌ఫిస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అమలాపాల్ సినిమాలలో నటిస్తూ మరోవైపు సినిమాలు నిర్మిస్తూ బిజీగా కొనసాగుతుంది. అమలాపాల్ ఇదే క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

amala paul hot attamil | AtTamil

అమలాపాల్‌ తెలుగు సినిమాలలో నటించక పోవటానికి కారణం ఏమిటి అని అడగగా ఈమె సంచలన ఆరోపణలు చేసింది…. “టాలీవుడ్ లో హీరోయిన్స్ ని కేవలం లవ్ సాంగ్స్ కి- ఎక్స్పోజింగ్ కి- రొమాన్స్ సీన్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని అందుకే నేను తెలుగులో నటించట్లేదని అమలాపాల్ చెప్పింది”. ‘సినిమా కథను బట్టి కాకుండా హీరోయిన్ తో గ్లామర్ షో మాత్రమే చేయిస్తారని… టాలీవుడ్ లో ఉన్న ఇలాంటి డిఫరెంట్ కల్చర్ కారణంగానే నేను సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదని.. వీటితోపాటు టాలీవుడ్ లో ఉన్న అగ్రా హీరోలు- దర్శకులపై కూడా అమలాపాల్ తన నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడింది’. ఇప్పుడు మీరు తెలుగులో నటిస్తారా అన్న ప్రశ్నకు.. “అమలాపాల్ ఇప్పుడు కాలం మారింది నేను తెలుగులో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానని అమలాపాల్ తెలిపింది”.

 

Share post:

Latest