అది అడ్డుగా ఉండడం వల్లే సినిమాలు చేయలేకపోతున్న అక్కినేని అమల..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు. ఇక నాగార్జున భార్య అక్కినేని అమల గతంలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించింది. అయితే నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీకి దూరమైంది. కేవలం తన ఇంటి బాధ్యతలు అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను మాత్రమే చూసుకుంటూ ఉండేది. అయితే శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా ఇమే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే అమల సినిమాలలో నటించకపోవడానికి కారణం అదే అని తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.

Know the cute love story of Nagarjuna and Amala as the couple celebrate  28th wedding anniversary

అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తరువాత ఏ సినిమాలో కూడా నటించలేదట అమల. అయితే ఇతర భాషలలో మాత్రం పలు వెబ్ సిరీస్లలో నటించానని తెలియజేసింది. తాజాగా శర్వానంద్ నటించిన ఒకే ఒక్క జీవితం సినిమా ద్వారా మళ్ళీ నటించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా అమల మాట్లాడుతూ.. తను సినిమాలలో ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం అన్నపూర్ణ స్టూడియో ఫిలిమ్ మీడియాలో ఉన్న వందలాదిమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కారణమని తెలియజేసింది.. వారి భవిష్యత్ త్తు బాధ్యత తన పైన ఉండడం చేత సినిమా అవకాశాలు వచ్చినా కూడా వాటిని తిరస్కరించానని తెలియజేసింది.

Telangana eyes Annapurna studio land

అయితే సినిమాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల ఆ విద్యార్థుల కోసం తమ సమయాన్ని కేటాయించలేనేమో అని తనకు అనిపించడం వల్ల నేను సినిమాలు చేయడం తగ్గించానని తెలిపింది కానీ.. ఒకే ఒక్క జీవితం సినిమా కథ మాత్రం తనకు ఒక మంచి స్టోరీలా అనిపించడంతో మనసుకు హత్తుకోనేలా కథ ఉండడంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అని తెలిపింది. ఇక నాగార్జునతో కలిసి మళ్ళీ ఎప్పుడైనా నటిస్తారా అనే ప్రశ్న ఎదురుగా.. ఇంట్లోనే ఇద్దరు కలిసే ఉంటాము కదా కనుక ఇద్దరము నటించే ఉద్దేశం అయితే లేదని చెప్పింది. కానీ ఎప్పుడైనా కథ నచ్చితే చేయడానికి ఓకే చెప్తానని తెలిపింది అమల.

Share post:

Latest