బాల‌య్య సెంటిమెంట్‌ను న‌మ్ముకుంటోన్న అడ‌వి శేష్‌… ఆ సెంటిమెంట్ ఇదే…!

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా హడావుడి ముగిసింది. ఇప్పుడు వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. ఇక ద‌స‌రా నుంచి మ‌ళ్లి స్టార్ హీరోల సినిమాల హడావుడి మొదలుకానుంది. ఈ క్రమంలోనే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే చిన్న సినిమాల నిర్మాతలకు డిస్టిబ్యూట‌ర్ల‌కు థియేటర్‌లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంటదని. చిన్న సినిమాల హీరోలు ప్రొడ్యూసర్లు ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలోని తాము ప్రకటించిన రోజున మరో సినిమా రాదన్న గ్యారెంటీ లేదు. ఈ సందర్భంలోనే మేజర్ లాంటి సూపర్ హిట్ అందుకుని. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న కొత్త సినిమా హిట్ 2 కూడా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 2న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. అయితే హిట్ 2 రిలీజ్ అయ్యే డిసెంబ‌ర్ 2న గ‌తేడాది బాలయ్య అఖండ సినిమాతో వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకే ఊపిరి పోశాడు.

ఇప్పుడు బాలయ్య – మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా అఖండ వచ్చిన రోజునే రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి అన్నీ పెద్ద సినిమాలే ఉన్నాయి. అయితే ఇదే రోజు అడ‌వి శేష్ సినిమా వ‌స్తుండ‌డంతో బాల‌య్య సినిమాను అదే రోజు వ‌దులుతారా ? లేదా మ‌రోడేట్‌న బాల‌య్య వ‌స్తాడా ? అన్న‌ది ఆస‌క్తిగా ఉంది. బాలయ్య కి అచ్చు వచ్చిన డేట్ అడవి శేష్‌ కి హిట్ అందిస్తుందా? ఈ సెంటిమెంట్ అటు నిర్మాత నానికి కలిసొస్తుందో లేదో అన్నది చూడాలి.

Share post:

Latest