తల్లి కావాలంటే పెళ్లి అవసరం లేదంటున్న టబు..

టబు ఈ నటి గురించి ప్రతేకంగా చెప్పనకేర్లేదు ,తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి ఎన్నో సినిమాలు నటించి మంచి పేరు సంపాదించుకున్నారు .తెలుగు లోనే కాకుండా తమిళ్ ,హిందీ ,మలయాళం సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు .అయితే 50 సంవత్సరాలు పైబడిన ఇంకా పెళ్లి కానీ హీరోయిన్ లలో ఈమె ఒకరు .ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన టబు అప్పటిలో ఒక స్టార్ హీరో తో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది .అయితే టబు ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి ప్రశ్నించగా టబు సంచలన వ్యాఖ్యలు చేసింది.మీరు ఇంత వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ,మీకు అమ్మ అని పిలిపించుకొని ఆశ లేదా అని ప్రశ్నించగా .తల్లి కావడానికి పెళ్లితో సంబంధం ఏంటి,తల్లి అవ్వాలంటే పెళ్లి చేసుకునే అవసరం లేదుగా అని సమాధానం ఇచ్చారు .అంతే కాకుండా పెళ్ళికి ,పిల్లలకి వయసుతో సంబంధం లేదని టబు అన్నారు .

తల్లి అవ్వాలంటే పెళ్లి అవసరం లేదు ,పెళ్లి కాకుండానే గర్భం దాల్చవచ్చు అని అన్నారు .సరోగసి ద్వారా కూడా తల్లి అవ్వొచ్చు అని ,ఆలా చేస్తే నన్ను ఎవరు ఆపరు ,అయినా పెళ్లి కాకపోయినా ,పిల్లల్ని కనకపోయిన చచ్చిపోతామా ఏంటి అని ఎదురు ప్రశ్నించారు టబు .అయితే ఈమధ్య టబు ఒక ప్రమాదం కూడా జరిగింది ,ఆమె అజయ్ దేవగన్ తో కలిసి భోలా సినిమాలో నటిస్తున్నారు .ఈ సినిమాలో టబు ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు ,ఈ సినిమా షూటింగ్ లో చేసింగ్ సీన్ చిత్రీకరణలో గాయాలు అయినట్టు తెలిస్తుంది ,ట్రక్ అద్దాలు పగిలిపోయడం తో టబు కి నుదుటిపైనా ,కంటి కింద గాయం అయినట్టు తెలిసింది ,అయితే డాక్టర్స్ పరీక్షా చేసి ప్రమాదం లేదని చెప్పడంతో చిత్ర సభ్యులందరు ఊపిరి పీల్చుకున్నారు .

Share post:

Latest