దేవిశ్రీ ప్రసాద్‌ని రహస్యంగా వివాహం చేసుకున్న ఆ నటి..?

పూజిత పొన్నాడ తుంటరి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఊపిరి సినిమాలో విక్రమాదిత్య (నాగార్జున) సర్వెంట్‌గా నటించి సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. ఈ రెండు చిత్రాలు 2016లో నాలుగు రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. వీటిలో నటించినా ఆమెకు గుర్తింపు రాలేదు కానీ ‘రంగస్థలం’ సినిమాలో ఆది పినిశెట్టి లవర్ క్యారెక్టర్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు, మిస్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.


కాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ఆకాశ వీధుల్లో మూవీ 2022, సెప్టెంబర్ 2న రిలీజ్ అయింది. ఈ లేటెస్ట్ మూవీ బాగుంటుందని చూడండి అంటూ ఈ మూవీ ప్రమోషన్లలో ఈ అమ్మడు చురుకుగా పాల్గొంటుంది. అయితే ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను దేవిశ్రీ ని గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలు ఫేక్ అని కుండబద్దలు కొట్టింది. దేవిశ్రీ తోనే కాదు తాను ఎవరితోనూ ఏ రిలేషన్‌షిప్‌ లేనని అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఏమీ తెలుసుకోకుండా తన గురించి ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తనకు చాలా బాధ కలిగించిందని వాపోయింది.

ఇకపోతే టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర మల్లు సినిమాలో ఈ అందాల తార ఒక సువర్ణ అవకాశాన్ని దక్కించుకుంది. దీని గురించి కూడా ఆమె ఆసక్తికర విషయాలు పొందుతుంది. హరిహర మల్లులో తన సీన్లకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని పేర్కొంది. పవన్ కళ్యాణ్ తో కలిసి అన్ని సీన్లు ఫినిష్ చేశానని వెల్లడించింది. ఓ సాంగ్‌లో కూడా కాలు కదిపానని చెప్పి ఫ్యాన్స్ లో ఎగ్జైట్‌మెంట్ భారీగా పెంచేసింది. మూవీ త్వరగా రిలీజ్ కావాలని తాను ఎంతగానో కోరుకుంటున్నానని పేర్కొంది. పవన్‌తో కలిసి సీన్స్ చేస్తున్నప్పుడు తనలో చాలా భయమేసిందని చెప్పుకొచ్చింది. ఏదేమైనా దేవిశ్రీ ప్రసాద్‌తో తనకెలాంటి సంబంధం లేదని పూజిత స్పష్టం చేసి అన్నీ పుకార్లకు చెక్ పెట్టండి.

Share post:

Latest