బిగ్ బాస్ శ్రీసత్య పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆయనే.. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!?

బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్రీ సత్య గురించి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. అయితే సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన‌.. ఆమె తనదైన శైలితో ఆడుతూ బిగ్ బాస్ లో కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసరికి హోస్ట్ నాగార్జున శ్రీ సత్యను.. ఆమె తినడానికి, పడుకోవడానికి మాత్రమే వచ్చినట్టు నేరుగా అడిగేసారు.

అయితే శ్రీ సత్యను తిండి మీద నిద్ర మీద పెట్టే శ్రద్ధ సగం ఆట మీద కూడా పెట్టాలంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. ఇకపోతే తోటి కంటెస్టెంట్లతో కూడా శ్రీ సత్య సరిగా మాట్లాడదు అని ఆమెను ఇంటి సభ్యులు నామినేట్ కూడా చేశారు. అయితే అలా ఉండడానికి గల కారణం ఏమిటో ఇటీవల సిసింద్రీ టాస్క్ లో బయటపెట్టి నిజా నిజాలు అందరికీ తెలిపింది. తాను ఇలా ఒక పరిధిలో ఉండడానికి గల కారణం ఏమిటంటే తాను గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల ప్రభావం కారణంగానే తాను అలా ఉంటుందని చెప్పింది.

అయితే శ్రీ సత్య, పవన్ రెడ్డి అనే వ్యక్తిని గతంలో ప్రేమించింద‌ట‌. వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందట. కానీ వీరి నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లకుండానే మధ్యలోనే ఎవరు ఊహించని విధంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందట. కాబట్టి తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో ఆమె అలా మారిందంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ డిప్రెషన్ లో సూసైడ్ ప్రయత్నం కూడా చేసుకుందట.

ఈ సంఘటనతో మనోవేదనకు గురైన వాళ్ళ అమ్మ ప్రస్తుతం అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉందంటూ కన్నీరు పెట్టుకుంది శ్రీ సత్య. ఇదిలా ఉంటే పవన్ రెడ్డి శ్రీ సత్య తనపై తప్పుడు ప్రచారాలు చేస్తుందంటూ అలా మోసం చేసేవాడినే అయితే నిశ్చితార్థం, పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్ రెడ్డి మండిపడ్డాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ వంటి పెద్ద షోలో శ్రీ సత్య తనపై తప్పుడు ప్రచారాలు చేయడం వ‌ల్ల‌ పవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడని సమాచారం. ‌.

Share post:

Latest