ఆ పొరపాటు చేయడం వల్లే ఇండస్ట్రీకి దూరమయ్య.. నటుడు పృథ్వి..!!

తెలుగు సినీ ప్రేక్షకులలో ఎప్పటికీ గుర్తుండిపోయే విలక్షణమైన నటన ప్రదర్శించిన వారిలో నటుడు పృథ్వి కూడా ఒకరు. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రం 1997లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రం ద్వారానే తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నారు పృద్వి. ఇక ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు. ఇక పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లో కూడా నటించారు ఈ నటుడు.

ACTOR BABLOO PRITHIVIRAJ FAMILY PHOTOS WITH WIFE SON FRIENDS AND BIOGRAPHY - YouTube
ఒకవైపు విలన్ గా మరొకవైపు హీరో కమెడియన్ గా కూడా పలు సినిమాలలో అలరించారు. అయితే కెరియర్ బాగా సాగుతున్న సమయంలోనే సినిమాలకు దూరమయ్యారు.పృథ్వి నటించక చాలా కాలం అవుతోంది.అయితే అప్పుడప్పుడు కేవలం బుల్లితెర పైన మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పృథ్వి తను సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని తెలియజేయడం జరిగింది.పృథ్వి మాట్లాడుతూ ఒకానొక సమయంలో తన చాలా డిప్రెషన్కు గురయ్యానని ఆ కారణం చేతనే సినిమాలకు దూరమయ్యానని తెలియజేశారు.

పృథ్వి మాట్లాడుతూ.. పెళ్లి సినిమాలో నటించిన అప్పటినుంచి తనని పెళ్లి పృథ్వి అని పిలుస్తూ ఉంటారని తెలిపారు. ఒక నటుడుగా తన చేయవలసిన పాత్రలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని తెలిపారు.. కానీ తనకు ఉన్నది ఒక కుమారుడు మాత్రమే ప్రస్తుతం తన వయసు 27 సంవత్సరాలు తన మానస్థితి ఎదుగుదల సరిగ్గా లేదు అనే విషయం తెలియగానే తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని అలా దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆ డిప్రెషన్ లోని ఉండిపోయానని దీంతో తన దగ్గరికి వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని కూడా కాదనుకున్నానుని తెలిపారు. ఆ పొరపాటు ఎంత పెద్దదో ఇప్పుడు అర్థం అయిందని తెలిపారు. అయితే కొన్ని సినిమాలలో నటించిన కొంతమంది హీరోలు కావాలనే తన సన్నివేశాలను తీసివేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. ఈ విషయం తన కెరీర్ పై చాలా ప్రభావం చూపిందని తెలిపారు నటుడు పృథ్వి.