వైసీపీ ఎంపీ గోరంట్ల వికృత చేష్ట‌లు… మ‌హిళ‌కు వీడియోలో పురుషాంగం చూపించి.. వీడియో వైర‌ల్‌..!

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. దీంతో వైసీపీని ప్ర‌త్య‌ర్థి పార్టీలు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. అస‌లు రాయ‌డానికి, చూప‌డానికి కూడా వీలులేనంత అస‌భ్య‌క‌ర రీతిలో ఎంపీ మాధ‌వ్ ప్ర‌వ‌ర్తించాడు.

- Advertisement -

ఒళ్లంతా న‌గ్నంగా ఉంది… అటు వైపు ఓ మ‌హిళ వీడియో కాల్‌లో ఉంది. ఆమె డ్రెస్సులోనే క‌నిపిస్తోంది. మాధ‌వ్ మాత్రం ఒంటిమీద నూలుపోగు లేకుండా ఉన్నాడు. త‌ర్వాత పూర్తి దిగంబ‌రుడు అయిపోయి త‌న పురుషాంగాన్ని ఆ మ‌హిళ‌కు ఓ వైపు చూపిస్తూ.. మ‌రోవైపు చుమ్మా అంటూ ముద్దులు పెడుతూ ఘోరంగా వ్య‌వ‌హ‌రించాడు.

అస‌లు మాధ‌వ్ బిహేవియ‌రే ముందు నుంచి కాంట్ర‌వ‌ర్సీగా ఉంది. తెలుగుదేశం ప్ర‌భుత్వంలోనే సీఐగా ఉండి అప్పుడు ఎంపీగా ఉన్న జేసీ దివాక‌ర్‌రెడ్డిని నాలుక చీరేస్తా అన్నాడు. మీసాలు తిప్పుతూ వార్త‌ల్లోకి ఎక్కాడు. త‌ర్వాత త‌న సీఐ ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలో చేరి హిందూపురం ఎంపీ అయిపోయాడు. ఆ త‌ర్వాత కూడా కియా మోటార్ ప్లాంట్ ద‌గ్గ‌ర బెదిరింపుల‌తో మొద‌లు పెడితే మాధ‌వ్ తీరుపై సొంత పార్టీ నేత‌ల్లోనే చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇక ఇప్పుడు తాజా చ‌ర్య‌ల‌తో తాను ఎంపీగా ఉన్న అధికార వైసీపీ ప‌రువును కూడా బ‌జారుకు ఈడుస్తున్నాడ‌ని ఆ పార్టీ నేత‌లు వాపోతున్నారు. దీనిపై పార్టీ కీల‌క నేత‌లు సైతం సీరియ‌స్‌గానే ఉన్నార‌ని అంటున్నారు. అత్యున్న‌త ఎంపీ ప‌ద‌విలో ఉండి ఇలా ఒళ్లు తెలియ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల నుంచి కూడా వ‌స్తున్నాయి. మాధ‌వ్‌పై పార్టీలో చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్నారు.

Share post:

Popular