వైఎస్‌. విజ‌య‌మ్మ‌కు త‌ప్పిన ప్ర‌మాదం… ఎక్క‌డంటే…!

దివంగ‌త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి త‌ల్లి అయిన‌ వైయస్ విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జరిగిన వివాహానికి హాజరైన‌ ఆమె… ఆ తర్వాత కర్నూల్ లోని వైఎస్సార్ మిత్రుడిని పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.

రెండు టైర్లు పేలి.. కారు అదుపు తప్పింది. దీంతో విజ‌య‌మ్మ ఏం జ‌రిగిందో అర్థం కాక తీవ్ర ఆందోళ‌న‌కు లోన‌య్యారు. వెంట‌నే డ్రైవర్ చాకచక్యంతో ఈ ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మరో కారులో కర్నూలు గెస్ట్ హౌస్ కి వెళ్లారు విజయమ్మ. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిసింది. విజ‌యమ్మ‌కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు వైఎస్ఆర్ అభిమానులు.

Share post:

Latest