జేడీ చ‌క్ర‌వ‌ర్తి భార్య‌ను టార్చ‌ర్ పెట్టిన ఆ టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎవ‌రు.. ఏం జ‌రిగింది…!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం శివ ఈ సినిమా ద్వారా జే డీ చక్రవర్తి తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుడుగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జెడి చక్రవర్తి. ఈయన ఎక్కువగా హర్రర్ సినిమాలలో నటిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈయన భార్య అనుకృతి కూడా హీరోయిన్ కావడం గమనార్హం. ఇదిలా వుండగా ఇటీవల జెడి చక్రవర్తి భార్య అనుకృతి డైరెక్టర్ యోగి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈమె జెడి చక్రవర్తి భార్య కంటే ముందు హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించింది. అయితే ఈమె యోగి పై ఫిర్యాదు చేయడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.JD Chakravarthy's marriage - A silent affairషార్ట్ ఫిలిం హీరోయిన్ అయిన హారిక యోగి వివాదంపై మొదటిసారిగా స్పందించడం జరిగింది. పదివేల రూపాయల కోసం తనను వేధిస్తోందని డైరెక్టర్ యోగి చెప్పడం అవాస్తవమని ఆమె తెలియజేసింది. తనను యోగి వేదిస్తున్నందుకే పోలీసులను ఆశ్రయించానని తనతో పాటు తన భర్తకు కూడా అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ ఉంటాడని అందుకు గల సాక్షాలను కూడా ఆమె తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై గతంలో కూడా హీరో జెడి చక్రవర్తి భార్య అనుకృతి కూడా ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తనను అసభ్యకరంగా నటించమని ఒత్తిడి చేస్తున్నాడని 2016లో జులై నెలలో జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించినట్లుగా అనుకృతి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అయితే అదే ఏడాది నటుడు జేడి చక్రవర్తి అనుకృతిని వివాహం చేసుకోవడం జరిగింది.hyderabad, నటిపై వేధింపుల కేసు: డైరెక్టర్ యోగి అరెస్టు - Harassment on  actress Harika case: Short film director Yogi arrested - Samayam Teluguఅయితే షార్ట్ ఫిలిం డైరెక్టర్ అయిన యోగి తనను వేధిస్తున్నట్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు చేయడంతో 2016లో డీసీపీ విశ్వనాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మహిళా వేధింపు కేసులో తన పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినా కూడా యోగీలో మార్పు రాలేదని హారికాకు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టిన వారిపై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు . అప్పట్లో ఈ విషయం చాలా వైరల్ గా మారింది.

Share post:

Latest