టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వివాదం ఇంకా సద్దుమణిగేట్టులేదు.. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసారు!

గత కొన్నాళ్ళనుండి టాలీవుడ్‌ ని డ్రగ్స్ వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా మ‌రోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేగింది. అవును, ఈ క్రమంలో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేసారని వినికిడి. అంతా ముగిసిపోయింది అనుకుంటే మళ్ళీ ఇదేంటి అని అనుకుంటున్నారా? మొదట టాలీవుడ్‌లో డగ్స్ రాకెట్‌ను స్టార్ట్ చేసిందెవ‌రు? పోలీసులు ఎవ‌రిని అరెస్ట్ చేశారు? అనే సందేహాలు మీకు వచ్చినప్పటికీ అవి ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే దీనివెనుక బడాబాబులు పేర్లు మనకు వినబడక మాన‌వు. అయితే ఆ విషయాలన్నీ గోప్యంగానే ఉంటాయి. కానీ సెలిబ్రిటీలు అంటే అలుసు కాబట్టి వారిపేర్లే ముందు బయటకు వస్తాయి.

ఆ విషయం పక్కన బెడితే… డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నాడ‌ని చెప్పి అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ గోపీ కృష్ణని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో త‌న ద‌గ్గ‌ర నుంచి 10 గ్రాముల కొకైన్‌, రూ. 55 వేల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త‌ను ఇచ్చిన స‌మాచారంతో డ్ర‌గ్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తోన్న అష్ర‌ఫ్ బేగ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు భోగట్టా. గ‌త కొన్ని నెల‌లుగా సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ కేసులో తెగ‌ని ముడిలా సాగిపోతుంది. బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖులు ప‌లువురు డ్ర‌గ్స్ కేసులో పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి అందరికీ తెలిసిందే.

గతంలోకి వెళితే బెంగుళూరులో హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ సోద‌రుడిని ఈ విషయమై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసినదే. అలాగే బాలీవుడ్‌లో రెండేళ్లు ముందు అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులోనూ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వెలుగులోకి వచ్చినమాట వాస్తవం. ఆ కేసులో రియా చ‌క‌వ్ర‌ర్తి, ఆమె సోద‌రుడిని పోలీసులు అరెస్ట్ చేయగా… కొన్నాళ్ల తరువాత వారు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ మ‌ధ్య‌లో షారూక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌ను కూడా పోలీసులు డ్ర‌గ్స్ కేసులోనే అరెస్ట్ చేసారు కూడా.

Share post:

Latest